AR Rehman: ప్రముఖ మ్యూజిక్​ డైరక్టర్ ఏఆర్​ రెహ్మాన్​కు అరుదైన గౌరవం

AR Rehman: ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్​.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహ్మాన్​కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం నిర్వహించిన కైరో ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివర్​ (CIFF), కైరో ఒపెరా హౌస్‌లో ఏఆర్ రెహమాన్‌కు ఘన సత్కారం లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన రెహ్మా.. ఈ అరుదైన గౌరవం అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. సంగీతంతో పాటు, పాటలు రాయడం, పాడటమే కాకుండా.. సినిమా కథలు కూడా రాస్తుంటారు రెహ్మాన్​. దీంతో పాటు నిర్మాతగా కూడా […]

Written By: Raghava Rao Gara, Updated On : November 29, 2021 9:47 am
Follow us on

AR Rehman: ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్​.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహ్మాన్​కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం నిర్వహించిన కైరో ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివర్​ (CIFF), కైరో ఒపెరా హౌస్‌లో ఏఆర్ రెహమాన్‌కు ఘన సత్కారం లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన రెహ్మా.. ఈ అరుదైన గౌరవం అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

సంగీతంతో పాటు, పాటలు రాయడం, పాడటమే కాకుండా.. సినిమా కథలు కూడా రాస్తుంటారు రెహ్మాన్​. దీంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్​, టాలీవుడ్​, అంతర్జాతీయ సినిమాలే కాకుండా.. థియేటర్​ ప్రాజెక్టుల్లోనూ పనిచేసిన అనుభవం రెహ్మాన్​ది. సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషకం పొందుతున్న టాప్​ మ్యూజిక్​ డైరెక్టర్లలో ఒకరు రెహ్మాన్​.

రెహ్మాన్​ తన తొలి సినిమా రోజాతో ఆయన సినీ కెరీర్​ను ప్రారంభించారు. ఆ తర్వాత బాంబె, కదలన్​, తిరుడా తిరుడా, జెంటిల్​మన్​తో సహా అనేక చిత్రాలకు మ్యూజిక్​ అందించారు. 2008లో స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే ఉత్తమ ఒరిజినల్​ స్కోర్​, బెస్ట్​ ఒరిజినల్​ సాంగ్​కు గాను ఆస్కార్​ అవార్డును అందుకున్నారు.

కాగా, డిసెంబరు 5 వరకు ఈ ప్రతిష్టాత్మక వేడుకలు జరగనున్నానయి. ఇందులో భాగంగా ఈజిప్టు ప్రఖ్యాత స్వరకర్త హిషామ్ నజీహ్ ఏఆర్ రెహమాన్ అద్భుతమైన పని గురించి చర్చిస్తూ ఒక ప్రత్యేక చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది చిత్రనిర్మాతలు, విమర్శకులు హాజరయ్యారు. 63 దేశాల నుండి 111 చిత్రాలను ప్రదర్శించడం, CIFF యొక్క 43వ ఎడిషన్ కార్యకలాపాలలో 34 ప్రపంచ ప్రీమియర్‌లు, వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు ఉన్నాయి. ఇలా చివరి వరకు అనేక కార్యక్రమాలు జరగనున్నాయి.