
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఒక వైపు రాజకీయం చేస్తూనే మరో వైపు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అనౌన్స్‌మెంట్స్‌తో అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ఐదు సినిమాలకు సంబంధించి అధికారికంగా ప్రకటనలు వచ్చేశాయి. ఇప్పటికే వేణుశ్రీరాం దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి ప్రస్తుతం ఒకే టైమ్ లో రెండు సినిమాలలో యాక్ట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా వకీల్ సాబ్ సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి మెగా అభిమానుల ఎదురు చూపులకు శుభం కార్డు వేశారు.
Also Read: ఉప్పెనకు భారీ ఆఫర్ !
అయితే రిలీజ్ “ఏప్రిల్” నెలలో అనేసరికి పవన్ అభిమానుల్లో కొత్త అనుమానం ఒకటి సోషల్ మీడియా సాక్షిగా బయటపడింది. పవన్ కెరీర్ లో బద్రి, ఖుషి, జానీ, జల్సా, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు యాదృచ్చికంగా ఏప్రిల్ నెలలోనే విడుదలయ్యాయి. అయితే ఇందులో మూడు సినిమాలు హిట్ అవ్వగా రెండు సినిమాలు దారుణ ఫలితాన్ని చూశాయి. దాంతో కొందరేమో వకీల్ సాబ్ కి తిరుగులేదు, హిట్ ఖాయం అంటుండగా… మరికొందరు ఏమౌతుందో ఏమో అనుకుంటూ ఆందోళన చెందుతున్నారు.
Also Read: మహా సముద్రం కోసం గోవాలో స్పెషల్ ‘సెట్’
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్లాప్ టాక్ తో పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకురాగల సత్తా ఉన్న హీరో పవర్ స్టార్, ఇక హిట్ అయితే రికార్డ్స్ సంగతి ఏమవుతుందో అందరికి తెలుసు. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘పింక్’ చిత్రానికి రీమేక్‌గా తెలుగులో తీయటం వలన ఈ సినిమా ఎలా ఉంటుందో అనే విషయంలో ఇప్పటికే ఒక అంచనా ప్రేక్షకులలో ఉంది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్సన్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ లు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్