Anupama Parameswaran: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరోగా చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి… దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హద్దులు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ మూవీ కోసం అనుపమ హద్దు దాటుతుందా… అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

ప్రేమమ్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ… పక్కింటి అమ్మాయిగా మారిపోయింది. ఇక గ్లామర్ షోకి, ముద్దు సన్నివేశాలకు ససేమిరా ఛాన్స్ లేదని చెప్పిన ఈ భామ. ప్రస్తుతం ఆ హద్దులు చెరిపివేస్తునట్లు తెలుస్తోంది. ఇటీవల బక్కచిక్కి కనిపించిన ఈ భామ ముద్దు సన్నివేశాలకు సైతం ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పటివరకు అనుకు అంతగా హిట్ పడలేదనే చెప్పుకోవాలి. కొన్ని సినిమాలు హిట్ టాక్ ని అందుకున్నా అందులో అనుపమకు మాత్రం గుర్తింపు రాలేదు. ఇక దీనికోసం అమ్మడ గ్లామర్ షో చేయడానికి రెడీ అవుతుందని టాక్ వినిపిస్తుంది.
ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన రొమాంటిక్ సాంగ్ చూస్తూనే ఈ పుకార్లు నిజమేనని అనిపిస్తున్నాయి. అలానే ఈ మూవీలో ఏకంగా ఐదు లిప్ లాక్ లకు రెడీ అయిపోయిందట అనుపమ. ఈ సినిమాతో అమ్మడి ఫేట్ మారిపోతుంది అని అంటున్నారు పలువురు ప్రముఖులు. మరి ఈ గ్లామర్ షోతో అమ్మడు అవకాశాలను అందుకుంటుందో… లేదో చూడాలి. నిర్మాత దిల్ రాజు కొడుకు వరస అయ్యే ఆశిష్ ని గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.