Anubhavinchu Raja: రాజ్‌తరుణ్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అనుభవించు రాజా. శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా నుంచి ఓ పాటను విడుదల చేసింది చిత్రబృందం. బతికేయ్ హాయిగా అంటూ సాగే ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం అందించారు. సింగర్ దీపు ఆలపించారు. గోపిసుందర్ ఈ సినిమాకు స్వరాలు అందించారు. వినోదాత్మక కథాంశంతో ఫ్యామిలీ మొత్తం మెచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించారు.
అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహించారు. ఓ యువకుడు ఎటువంటి ఉద్యోగం చేయకుండా.. ఫ్యామిలీని కష్టపెడుతూ.. కోళ్ల పందేలకు బానిసగా సాగే కథతో సినిమా తీశారు. ఆ యువకుడిగానే రాజ్‌తరుణ్ నటించారు.
కాగా, ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు రాజ్‌తరుణ్. ఆ తర్వాత కుమారి 21ఎఫ్ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అంధుడి పాత్రలోనూ ఓ సినిమాలో నటించి మెప్పించారు. అయితే, ఇటీవల ఒక్క హిట్‌కూడా అందుకోని రాజ్‌తరుణ్.. ఈ సినిమాతోనైనా ప్రేక్షకులను మెప్పించాలని బలంగా అనుకుంటున్నారు. మరి చూద్దాం. ఈ సినిమా అయినా బాక్సాఫీసు వద్ద నిలుస్తుందా.. లేక.. మిగిలిన చిత్రాల్లాగే వెళ్లిపోతుందా అని.
