Site icon OkTelugu

Shyam Singha Roy: ‘శ్యామ్ సింగరాయ్’ ఖాతాలో మరో వరల్డ్ రికార్డు !

Shyam Singaray: రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్లుగా వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా మరో అరుదైన రికార్డును నెలకొల్పింది. థియేటర్లలో మంచి హిట్ సాధించిన ఈ మూవీ నెట్‌ ఫ్లిక్స్‌ లోనూ రిలీజై బాగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాకు ఇప్పటి వరకూ 35,90,000 వీక్షణలు వచ్చాయి.

Shyam Singha Roy

 

దీంతో నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన 3వ చిత్రంగా ఈ సినిమా నిలిచింది. మొత్తానికి యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ తన డైరెక్షన్‌ తో ఈ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయిపల్లవి నటన కూడా అద్భుతంగా ఉంది. ఇక కృతిశెట్టి గ్లామర్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది.

Also Read:  ‘శ్యామ్ సింగరాయ్’ ఖాతాలో మరో వరల్డ్ రికార్డు !

మొత్తమ్మీద ‘శ్యామ్ సింగరాయ్’ వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమా టీమ్ ఈ విషయాన్ని ఫుల్ ప్రమోట్ చేయడానికి ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తున్నారు. హీరో నాని కూడా ఈ విజయాన్ని తన స్టార్ డమ్ ఖాతాలో వేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

Shyam Singha Roy Day 11 collections

మరోపక్క విమర్శకులు సైతం ఇది అద్భుతమైన ప్రయోగాత్మక సినిమా అంటూ పొగడ్తల వర్షం కురిపించడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయింది. ఏది ఏమైనా మొదటి రోజు నుంచీ ఈ సినిమాకి ఫుల్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దాంతో స్టడీగా థియేటర్ రెవెన్యూ ఈ సినిమాకు వచ్చింది.

పైగా ఈ ‘శ్యామ్ సింగ రాయ్’కి హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ఈ సినిమాను నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నాడు కాబట్టి.. ఈ సినిమా నిర్మాతకు బాగా కలిసి వచ్చింది. మంచి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ హిట్ కోసం నాని ఎంతో కసితో ఈ సినిమా చేశాడు. చివరకు ఆ ఫలితం వచ్చింది.

Also Read: పుష్ప మూవీ ఈ స్టార్స్ చేయాల్సింది.. ఎందుకు వదులుకున్నారు?

Exit mobile version