Bhavadiyudu Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇది పూర్తయ్యాక హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ చేయబోతున్నారు. క్రిష్ మూవీ ‘హరిహర’ను ఈ దసరాలోపు పూర్తి చేసి ఆ తర్వాత రాజకీయ యాత్ర మధ్యలో గ్యాప్ తీసుకొని ‘భవదీయుడు’ పూర్తి చేస్తాడని.. లేదంటే యాత్ర తర్వాత ఈ సినిమాను పూర్తి చేయబోతున్నట్టు టాక్. వచ్చే వేసవిలో దీని రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

భవదీయుడు భగత్ సింగ్ సినిమాలోని కొన్ని సీన్లు అభిమానులను మునివేళ్లపై నిలబెడుతాయని.. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ చిత్రంలోని సీన్లు గూస్ బాంబ్స్ తెప్పిస్తాయని డైరెక్టర్ హరీష్ శంకర్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి సినిమా ఆశిస్తున్నారో అలాంటి సినిమానే వస్తుందని హామీ ఇచ్చాడు.
గబ్బర్ సింగ్ లో ఎంత జోష్ లోనైతే పవన్ కళ్యాణ్ నటించాడో అంతటి జోష్ ఉన్న పాత్రను ‘భగత్ సింగ్’ సినిమాలో చేయబోతున్నాడని.. అంతటి శక్తివంతమైన దేశభక్తుడి పాత్ర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.

ఇక ఇటీవల ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాకు పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించడం లేదని.. ఆయన రాజకీయ యాత్రకు వెళితే సినిమా ఆగిపోతుందని వార్తలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాదని.. పవన్ యాత్ర మధ్యలో లేదా.. పూర్తయ్యాక సినిమా పట్టాలెక్కుతుందని హరీశ్ శంకర్ మాటలతో నిజమైంది.