https://oktelugu.com/

Karthika Deepam: కార్తీకదీపం లో మరో ట్విస్ట్.. కుటుంబంతో రోడ్డున పడ్డ డాక్టర్ బాబు!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ దీపకు అసలు నిజాన్ని చెప్పి ఇంట్లో వాళ్లకు ఎవరికీ చెప్పకుండా తన కుటుంబంతో రోడ్డుపై ప్రయాణిస్తాడు. పిల్లలకు సర్ప్రైస్ ట్రిప్ అని చెప్పి తీసుకెళ్తారు. తన దగ్గరున్న ఫోన్ రోడ్డు పక్కన వేసి బస్సులో ప్రయాణిస్తారు. సౌందర్య, ఆనందరావు కార్తీక్ జీవితం గురించి ఆలోచిస్తూ ఏదైనా వ్యాపారంలో చేర్పించాలని అనుకుంటారు. ఇక దీపను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 8, 2021 / 09:27 AM IST
    Follow us on

    Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ దీపకు అసలు నిజాన్ని చెప్పి ఇంట్లో వాళ్లకు ఎవరికీ చెప్పకుండా తన కుటుంబంతో రోడ్డుపై ప్రయాణిస్తాడు. పిల్లలకు సర్ప్రైస్ ట్రిప్ అని చెప్పి తీసుకెళ్తారు. తన దగ్గరున్న ఫోన్ రోడ్డు పక్కన వేసి బస్సులో ప్రయాణిస్తారు.

    Karthika Deepam

    సౌందర్య, ఆనందరావు కార్తీక్ జీవితం గురించి ఆలోచిస్తూ ఏదైనా వ్యాపారంలో చేర్పించాలని అనుకుంటారు. ఇక దీపను పిలవడంతో శ్రావ్య వచ్చి అక్కడ లేదని చెప్పి అక్కడ కార్తీక్ రాసిన లెటర్ ను చూస్తుంది. అందులో కార్తీక్ రాసింది చదివి ఏడుస్తుంది. వెంటనే సౌందర్య ఆ లెటర్ చూసి చదివి బాగా ఎమోషనల్ అవుతుంది. ఆనందరావు, ఆదిత్య తెగ టెన్షన్ పడుతుంటారు. మరోవైపు మోనిత ప్రియమణికి కార్తీక్ డాక్టర్ ఉద్యోగం పోయిందని తెలుపుతుంది.

    Also Read: యాక్సిడెంట్ చేసిన గృహలక్ష్మి సీరియల్ నటి లహరి…

    ప్రియమణి షాక్ అవుతుంది. ఆ లెటర్ లో కార్తీక్ తనకోసం వెతకవద్దని ఒక్కడే కొడుకు, కోడలని.. తన దారి తాను చూసుకున్నానని అంటాడు. వెంటనే ఆనందరావు బాధపడుతూ కార్తీక్ కు ఏం జరగదని తన వెంట దీప ఉన్నంతకాలం కార్తీక్ కు తానే ధైర్యం అని అంటాడు. అన్నయ్యను వెతకాలని ఆదిత్య అనటంతో తప్పిపోయిన వాళ్ళని వెతకొచ్చు కానీ దారిని చూసుకున్న వాళ్లను వెతకలేం అని అంటాడు ఆనందరావు.

    ఇక తరువాయి భాగంలో కార్తీక్, దీప ఓ పాత ఇంట్లోకి వెళ్తారు. మరోవైపు మోనిత బిడ్డ ని తీసుకొని సౌందర్య ఇంట్లోకి అడుగు పెడుతుంది. కార్తీక్ ఎక్కడ అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. మొత్తానికి కార్తీకదీపం సీరియల్ లో మళ్లీ పెద్ద ట్విస్ట్ ఎదురైంది. మోనిత కార్తీక్ ను రోడ్డున పడేలా చేసింది. దీనిని బట్టి చూస్తే ఇకపై దీప వంటలు చేస్తూ తన కుటుంబాన్ని రక్షిస్తుందేమో అని అర్థమవుతుంది.

    Also Read: షాకింగ్.. జబర్ధస్త్ కు సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రాంప్రసాద్ టీం గుడ్ బై!