టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లు కేవలం డైరక్షన్ మాత్రమే కాదు, నిర్మాతల అవతారం కూడా ఎత్తుతున్నారు. అలాగే సమర్పకుడిగా, దర్శకత్వ పర్యవేక్షకుడిగా మారడానికి సక్సెస్ ఫుల్ డైరక్టర్లు తెగ ఉత్సాహ పడుతున్నారు. ఇది వారికీ సైడ్ బిజినెస్ లాంటిది. ఈ బిజినెస్ లో చేతినిండా లాభాలు రాకపోయినా వారికి పోయేది ఏమి లేదు. అదే సినిమా వర్కౌట్ అయితే, చేతిలోకి కోట్లు వచ్చి పడతాయి.
దర్శకుడు సుకుమార్ ఈ తరహా బిజినెస్ తోనే ఆర్ధికంగా బలపడ్డాడు. అలాగే దర్శకుడు మారుతి కూడా ఇలాంటి వ్యవహారాల వల్లే బాగా క్యాష్ చేసుకున్నాడు. ఇప్పుడు అనీల్ రావిపూడి కూడా వరుసగా ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ కూడా. ఈ ఇద్దరు దర్శకులు కెరీర్ లో ప్రస్తుతం మంచి సక్సెస్ లో ఉన్నారు.
సక్సెస్ ఉన్నప్పుడే దర్శకత్వ పర్యవేక్షకుడిగా అవతారం ఎత్తితే ఆ సినిమాకి డిమాండ్ ఉంటుంది అని అనిల్ రావిపూడి గాలిసంపత్ తో నిరూపించాడు. అందుకే హరీష్ శంకర్ కూడా తాజాగా ఒక ప్రాజెక్టులోకి ఎంటరయ్యాడని తెలుస్తోంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరో. ఈ సినిమాకి హరీష్ శంకర్ స్నేహితుడు నిర్మాత. ముందుగా ఈ సినిమాకి హరీష్ కి స్క్రీన్ ప్లే-ప్రజెంటర్ కార్డు వేయాలనుకున్నారు.
కానీ, సినిమాకు మరింత క్రేజ్ తీసుకురావాలంటే… దర్శకత్వ పర్యవేక్షణ అనే పెద్ద కార్డు వేస్తేనే సినిమాకి డిమాండ్ ఉంటుంది. అందుకే హరీష్ శంకర్ కూడా దర్శకత్వ పర్యవేక్షణ కార్డుతో త్వరలోనే ఓ సినిమాలో కనిపించబోతున్నాడు. కాకపోతే ఈ కార్డు వేసినంత మాత్రాన సినిమా హిట్ అయిపోతుంది అనుకుంటే పొరపాటే. అనీల్ రావిపూడిని పూర్తిస్థాయిలో వాడుకున్నప్పటికీ గాలిసంపత్ దారుణంగా తేలిపోయిన అనుభవం ఉంది కదా.