HBD Superstar MaheshBabu : ఫ్యాన్స్ కి అదిరిపోయే బర్త్ డే ట్రీట్… మహేష్ నెవర్ బిఫోర్ అవతార్!

ఇప్పటికే విడుదలైన టీజర్ సూపర్ హిట్ అయ్యింది. లేటెస్ట్ గా వచ్చిన పోస్టర్ కూడా అదే స్థాయిలో సక్సెస్ అయ్యింది. నిజానికి మహేష్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుండి సాంగ్ ను రిలీజ్ చేయాలని అనుకున్నారు.

Written By: Shiva, Updated On : August 9, 2023 10:06 am

Mahesh Babu Birthday

Follow us on

HBD Superstar MaheshBabu : స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఆయా హీరోలు నటిస్తున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వడం మామూలే. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుండి మహేష్ బాబు పోస్టర్ ఒకటి చిత్ర యూనిట్ అర్ధరాత్రి విడుదల చేయడం విశేషం. ఇలా విడుదలైన పోస్టర్ ఆలా సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్ లోకి దూసుకెళ్తుంది.

ఈ రోజు 47 వ పుట్టినరోజు జరుపుకుంటున్న మహేష్ బాబుకి సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇక త్రివిక్రమ్ , మహేష్ బాబు కాంబో లో ముచ్చటగా రాబోతున్న మూడో సినిమా గుంటూరు కారం. దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని మరింత పెంచే విధంగా ఉంది తాజాగా విడుదలైన పోస్టర్. లుంగీ కట్టుకొని బీడీ తాగుతున్న ఫోజులో మహేష్ ను చూస్తే ఉర మాస్ గా కనిపిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన టీజర్ సూపర్ హిట్ అయ్యింది. లేటెస్ట్ గా వచ్చిన పోస్టర్ కూడా అదే స్థాయిలో సక్సెస్ అయ్యింది. నిజానికి మహేష్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుండి సాంగ్ ను రిలీజ్ చేయాలని అనుకున్నారు. దానికి సంబంధించిన ట్యూన్ ఫైనల్ చేసిన తమన్ దాన్ని విదేశాల్లో ఉన్న మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ కోసం పంపినట్లు తెలుస్తుంది. మహేష్ ఓకే చేస్తే లిరిక్స్ ను ఫైనల్ చేసి, సాంగ్ కంపోజ్ చేసి రిలీజ్ చేయాలని అనుకున్నారు.

కానీ మహేష్ నుంచి అనుమతి రాకపోవటంతో సాంగ్ ను వాయిదా వేసి పోస్టర్ ను రిలీజ్ చేశారు. మొదటి నుంచి కూడా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మహేష్ బాబు హ్యాపీ గా లేడనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ త్రివిక్రమ్ పట్టుపట్టి మరీ థమన్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. మరి చివరి ఏమి అవుతుందో చూడాలి. మహేష్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల కాబోతుంది.