Pushpa 2: కొన్ని సినిమాలకు లీకులు మంచి చేస్తే కొన్ని సినిమాలకు మాత్రం చెడు చేస్తుంటాయి. కొన్ని లీకుల వల్ల సినిమాపై ఇంట్రెస్ట్ కలుగుతుంది. కానీ అదే కంటిన్యూ అయితే ఓస్ ఇంతేనా సినిమా అంటూ లైట్ తీసుకుంటారు ఆడియన్స్. అందుకే వీలైనంత వరకు సినిమా నుంచి లీకులు లేకుండానే చూసుకుంటారు చిత్ర యూనిట్. కానీ పుష్ప సినిమాకు మాత్రం లీకుల బెడద అసలు ఆగడం లేదు. ఈ సినిమా నుంచి మరొక లీకు రావడంతో.. ఇక సినిమా పై ఇంట్రెస్ట్ వచ్చేదెలా? ఎవరు ఈ లీకులు చేసేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
సుకుమార్, అల్లు అర్జున్ కలిసి పాన్ ఇండియాకి బిగ్గెస్ట్ ఎర్రచందనం స్మగ్లర్ కథను చెప్పడానికి రెడీ అయ్యారు. ఇక పుష్ప ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి వస్తున్న ఈ కాంబినేషన్ వెయ్యి కోట్ల మార్క్ ను టార్గెట్ చేస్తుంది. ఒక్క పోస్టర్ తోనే సినిమాపై అంచనాలను పెంచిన సుకుమార్, అల్లు అర్జున్ ఆగస్ట్ 15న రిలీజ్ కావడానికి చాలా కష్టపడుతున్నారు. ఒకటికి రెండు యూనిట్స్ ని పెట్టి మరీ పుష్ప షూటింగ్ ను పూర్తి చేయాలి అనుకుంటున్నారు. ఇక రిలీజ్ పోస్ట్ పోన్ అవకుండా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఇటీవల 48 రోజుల పాటు గంగమ్మ జాతర ఎపిసోడ్ ను షూట్ చేశారు సుకుమార్.
12 నిమిషాల పాటు గూస్ బంప్స్ ఇచ్చే ఎపిసోడ్ ని తెరకెక్కించిన సుకుమార్ ఈ షెడ్యూల్ షూటింగ్ స్పాట్ నుంచి అల్లు అర్జున్ చీరలో ఉన్న ఫోటో లీక్ అయితే ఆయన యూనిట్ పై సీరియస్ అయ్యారు. చీర కట్టుకొని కుర్చీలో కూర్చొని ఉన్న అల్లు అర్జున్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ లీక్ దెబ్బకు సోషల్ మీడియా పుష్ప 2 పేరుతో మారుమోగింది. లీకులు కాకుండా చూసుకోవాలని సుకుమార్ అండ్ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ మరో లీక్ అయింది. పుష్ప 2 నుంచి ఇప్పుడు మరో లీక్ బయటకు వచ్చేసింది.
లేటెస్ట్ గా వచ్చిన లీకులో రావు రమేష్ పార్టీకి సంబంధించినది కావడం విశేషం. పుష్ప సినిమాలో ఎంపీ భూమిరెడ్డి సిద్దప్ప నాయుడు పాత్రలో కనిపించిన రావు రమేష్.. ఎర్ర చందనం సిండికేట్ కి హెడ్. పార్ట్ 1లో ఈ సిండికేట్ ని పుష్ప చేతికి అప్పగించిన సిద్ధప్ప నాయుడుకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతుందట. ఈ షూటింగ్ స్పాట్ నుంచి రావు రమేష్ ప్రజా చైతన్య పార్టీ అనే ఫ్లెక్సీలు బయటకు వచ్చాయి. ఈ లీకులను ఇప్పటికీ అయినా ఆపకపోతే ఇక సినిమా మీద క్యూరియాసిటీ పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బన్నీ-సుకుమార్ ఫ్యాన్స్.