Pushpa 2 Leak: పుష్ప 2 నుండి మరో లీక్… పుష్పరాజ్ బంగ్లా చూశారా!

తాజాగా రష్మిక మందాన బంగ్లా సెట్ కి సంబంధించిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అది పుష్పరాజ్ ఇల్లు కావచ్చని అంచనా వేస్తున్నారు. రెడ్ శాండల్ స్మగ్లింగ్ లో డాన్ గా ఎదిగిన పుష్ప లైఫ్ స్టైల్ మారిపోతుంది.

Written By: Shiva, Updated On : September 8, 2023 6:30 pm

Pushpa 2 Leak

Follow us on

Pushpa 2 Leak: పుష్ప 2 టీమ్ స్వయంగా కొన్ని లీక్స్ ఇస్తుంది. వాళ్ళ ప్రమేయం లేకుండా ఫోటోలు, వీడియోలను ఇతరులు సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ టీమ్ అల్లు అర్జున్ మీద స్పెషల్ వీడియో చేసింది. ఆ వీడియోలో పుష్ప 2 కోసం తీసిన కొన్ని సన్నివేశాలు మనకు చూపించారు. పుష్ప 2లో అల్లు అర్జున్ లుక్ సైతం షేర్ చేయడం జరిగింది. ఇటీవల సెట్స్ నుండి ఓ సంచలన వీడియో బయటకొచ్చింది. వందల లారీలు ఒక చోట నిలిపి ఉన్నాయి. ఈ లారీలు పుష్ప 2 క్లైమాక్స్ చిత్రీకరణ కోసం తెచ్చారనే ప్రచారం జరిగింది.

తాజాగా రష్మిక మందాన బంగ్లా సెట్ కి సంబంధించిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అది పుష్పరాజ్ ఇల్లు కావచ్చని అంచనా వేస్తున్నారు. రెడ్ శాండల్ స్మగ్లింగ్ లో డాన్ గా ఎదిగిన పుష్ప లైఫ్ స్టైల్ మారిపోతుంది. తాను చిన్నప్పటి నుండి కోల్పోయిన పేరు, కీర్తి, గౌరవం, సంపద రాబట్టుకుంటాడు. ఫస్ట్ హాఫ్ లో గుడిసెలో కనిపించిన పుష్పరాజ్ పుష్ప 2లో ఖరీదైన బంగ్లాలో ఉంటాడు.

ఆ బంగ్లా సెట్ నే రష్మిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారనే వాదన మొదలైంది. కాగా రష్మిక పాత్ర చనిపోతుందని సమాచారం. ఇటీవల దీనికి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది ఒరిజినల్ ఫోటోనా లేక ఫేక్ ఫోటోనా అనేది తెలియదు. పార్ట్ 2లో రష్మిక పాత్ర నిడివి కూడా తగ్గించారనే పుకార్లు ఉన్నాయి. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.

పుష్ప 2 వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి రూ. 1000 కోట్ల ఆఫర్ వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. ఇక పుష్ప పార్ట్ 1 ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు విభాగాల్లో రెండు జాతీయ అవార్డులు అందుకుంది. అల్లు అర్జున్, దేవిశ్రీ మొదటిసారి నేషనల్ అవార్డు కైవసం చేసుకున్నారు