Pavan Hari Hara Veera Mallu: క్రియేటివ్ డైరెక్టర్ అంటూ ఎప్పటికప్పుడు డప్పు వేయించుకునే అలవాటు గట్రా ఉన్న క్రిష్ ప్రస్తుతం తెగ కష్టపడుతున్నాడు. అయితే, తన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం గ్లామర్ డోస్ ను విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాడు. గతంలో క్రిష్ ఎప్పుడు ఇలా హీరోయిన్ల కోసం తాపత్రయ పడలేదు. తాజా సమాచారం మేరకు వీరమల్లు సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ‘నోరా ఫతేహీ’ కూడా నటించబోతుంది.

ఈ సినిమా కొత్త షెడ్యూల్ లో నోరా ఫతేహీ పై ఓ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు. ఐతే, పవన్ సరసన ఇలా మరో భామ నటిస్తూ ఉండేసరికి ఇలా ఇంకా ఎంత మంది హీరోయిన్లు ఉన్నారు ఈ సినిమాలో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ పార్ట్ ను తర్వాత ప్రత్యేకంగా షూట్ చేస్తారట. ఇక ఈ క్రేజీ చిత్రం హరిహర వీరమల్లు దసరాను టార్గెట్ చేసినట్టు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ నెలలో చిత్ర తదుపరి షెడ్యూల్ ప్రారంభమవుతుండగా సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేయాలని క్రిష్ భావిస్తున్నారట.
ఇప్పటికే 60 శాతం పూర్తి కాగా, అక్టోబర్ 5న విజయ దశమి సందర్భంగా విజయదుందుభి మోగించాలనుకుంటున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ డేట్లు అన్ని సినిమాలకు తలా నాలుగు రోజులు ఇస్తూ ఎలాగోలా ఒకేసారి మూడు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. దాంతో క్రిష్ సినిమా బాగా లేట్ అవుతుంది. అసలుకే మొఘల్ కాలం నాటి కథతో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు సినిమా.

కాబట్టి, సినిమా నేపథ్యానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. పైగా పవన్ కి ఈ సినిమాలో 3 షేడ్స్ కు సంబంధించి 3 డిఫరెంట్ గెటప్స్ ప్లాన్ చేశాడు క్రిష్. ఒకటి వజ్రాల దొంగ వీరమల్లు గెటప్ అయితే, సిక్కు సైనికుల్ని కాపాడే రక్షకుడిగా మరో గెటప్, అలాగే దేశం కోసం పోరాడే వీరుడిగా మరో గెటప్ లో పవన్ కనిపించబోతున్నాడు.
అన్నిటికీ మించి 17వ శతాబ్దం నాటి కథ కావడంతో.. పవన్ దుస్తులు, యాక్ససరీస్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇలా పవన్ పాత్రలో 3 డిఫరెంట్ షేడ్స్, గెటప్స్ ఉండటంతో చాల స్లోగా సాగుతుంది షూటింగ్. ఏది ఏమైనా దసరాకి మాత్రం సినిమా రిలీజ్ చేయాలని నిర్మాత రత్నం ప్లాన్. మరి ఏమవుతుందో చూడాలి.
Recommended Videos: