Manchu Manoj Upcoming Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. విలక్షణ నటుడిగా ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న ఆయన ఒకప్పుడు చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి.ఇక తన తర్వాత తన వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా వాళ్లతో మంచి సినిమాలు చేయించడానికి ఆయన అహర్నిశలు ప్రయత్నమైతే చేశాడు. ఇక అందులో భాగంగానే విష్ణు హీరోగా వరుస సినిమాలను చేస్తూ తనను తాను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మనోజ్ మొదట్లో హీరోగా రాణించినప్పటికి, పర్సనల్ గా ఆయనకి ఎదురైన కొన్ని ఇబ్బందుల వల్ల ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు…బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన భైరవం సినిమాతో నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చిన మనోజ్ ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపైతే రాలేదు. ఇక ప్రస్తుతం తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిరాయి’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో మనోజ్ ఒక పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో మనోజ్ పాత్రకి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది.
చాలామంది అతన్ని డిఫరెంట్ పాత్రల్లో తీసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మిరాయి మూవీ రిలీజై కేవలం మూడు రోజులు మాత్రమే అయింది. అంతలోనే మనోజ్ దాదాపు 11 సినిమాలకు కమిట్ అవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఇప్పటివరకు మంచు ఫ్యామిలీలో ఇలాంటి ఒక సంతోషకరమైన విషయమైతే జరగలేదు.
గత కొన్ని రోజుల నుంచి వాళ్ల మధ్య ఆస్తులకు సంబంధించిన వివాదాలైతే జరుగుతున్నాయి. ఇక మిరాయి సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో అటు మంచు విష్ణు సైతం మంచు మనోజ్ ను పొగుడుతూ తన క్యారెక్టర్ అద్భుతంగా ఉందని ఒక ట్వీట్ అయితే చేశాడు. ఇక మంచు లక్ష్మి సైతం మంచు మనోజ్ మీద ఉన్న తన ప్రేమను చూపించింది. ఇలా మంచు ఫ్యామిలీ మొత్తం కలిసిపోయారు. అలాగే మనోజ్ సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…
అయితే మిరాయి సినిమా కోసం ఆయన 2 కోట్ల 70 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు కమిట్ అవుతున్న సినిమాలకు మాత్రం 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏదేమైనా కూడా ప్రస్తుతం అయిన 11 సినిమాలకు కమిట్ అవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…