Animal Collection: అనిమల్ సినిమా ఇప్పటికే అన్ని వందల కోట్ల కలెక్షన్లు ని రాబట్టిందా..?

అనిమల్ సినిమా ఇండియా వైడ్ గా ఇప్పటి వరకు సంపాదించిన కలెక్షన్ల వివరాలను కనక మనం తెలుసుకున్నటైతే... ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి మొదటి రోజు 63 కోట్ల రూపాయలను వసూలు చేయగా, రెండో రోజు 68 కోట్ల రూపాయలు.

Written By: Gopi, Updated On : December 8, 2023 8:51 am

Animal OTT

Follow us on

Animal Collection: సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రన్బీర్ కపూర్ హీరోగా వచ్చిన అనిమల్ సినిమా తనదైన రీతిలో భారీ సక్సెస్ ని అందుకొని కలెక్షన్ల సునామిని సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ తోనే జనాల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసుకుని చిన్నపిల్లల నుంచి ముసలోళ్లదాక అందరూ కూడా ఈ సినిమాని చూడటానికి మంచి ఉత్సాహం చూపిస్తూ ఉండడం అలాగే ఈ సినిమాకి రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతూ ఉండడంతో అనిమల్ సినిమా లాంగ్ రన్ లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా మిగిలే అవకాశాలు అయితే ఉన్నాయి…

అనిమల్ సినిమా ఇండియా వైడ్ గా ఇప్పటి వరకు సంపాదించిన కలెక్షన్ల వివరాలను కనక మనం తెలుసుకున్నటైతే… ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి మొదటి రోజు 63 కోట్ల రూపాయలను వసూలు చేయగా, రెండో రోజు 68 కోట్ల రూపాయలు, మూడో రోజున 70 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 46 కోట్ల రూపాయలు, ఐదో రోజున 39 కోట్లు రూపాయలు, 6వ రోజున ఈ సినిమా 32 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.ఇక ఈ సినిమా దాదాపు 320 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది.

అనిమల్ సినిమా ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా తన సత్తా చాటుతుంది. ఇక ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తుంది.ఇక ఈ మూవీ అమెరికా, కెనడాలో భారీగా వసూళ్లను రాబడుతుంటే.. గల్ఫ్, యూఏఈ, యూకే, ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతున్నది. దాంతో ఈ సినిమా గత ఆరు రోజుల్లో 18 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 154 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేయడం విశేషం…

ఇక ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్థాయి. అందుకే ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తూ ఈ సినిమా కి మంచి గుర్తింపు తీసుకురావడంలో చాలా వరకు కృషి చేస్తున్నారు… ఇది కంప్లీట్ గా డైరెక్టర్ సందీప్ రెడ్డి మ్యాజిక్ అని చెప్పాలి ఈయన ఇప్పటివరకు చేసిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలు కూడా భారీ వసూళ్లను రాబట్టి అప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటిని బ్రేక్ చేస్తూ ఒక కొత్త ఒరవాడకి స్వీకారం చుట్టాయి. ఇక అదే రీతిలో అనిమల్ సినిమా కూడా ప్రేక్షకులా నుంచి మంచి ఆదరణ ఉంటుంది…ఇక ఈ సినిమాతో సందీప్ వంగ అనిమల్ డైరెక్టర్ సందీప్ వంగ గా గుర్తింపు పొందాడు…