Animal Movie Collections : రికార్డు బ్రేకింగ్ వసూళ్లు… బాక్సాఫీస్ వద్ద యానిమల్ ప్రభంజనం!

ఒక్క యూఎస్ లో యానిమల్ వసూళ్లు రూ. 41.39 కోట్లకు చేరాయి. బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో పాటు ఓవర్సీస్ లో విపరీతమైన రెస్పాన్స్ దక్కుతుంది. యానిమల్ మూవీ ఊహించని రికార్డులు నమోదు చేయడం ఖాయం.

Written By: NARESH, Updated On : December 4, 2023 9:38 am

Animal

Follow us on

Animal Movie Collections : బాక్సాఫీస్ వద్ద యానిమల్ మూవీ సునామీ కొనసాగుతుంది. షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ రికార్డ్స్ బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదు. ఆ రేంజ్ లో దూసుకుపోతుంది. యానిమల్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. కొందరు ఆడియన్స్ అద్భుతంగా ఉందని కామెంట్ చేయగా, మరికొందరు వరస్ట్ మూవీ అంటూ అభిప్రాయపడ్డారు. ఫిల్మ్ క్రిటిక్స్ కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ నడుస్తుంది. అందుకు తగ్గట్లే వసూళ్లు ఉన్నాయి.

యానిమల్ వసూళ్లు వీకెండ్ వరకూ పెరుగుతూ వచ్చాయి. నాన్ హాలిడే రిలీజ్ లో కూడా సత్తా చాటింది. యానిమల్ ఫస్ట్ డే హిందీ వెర్షన్ రూ. 54.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇక శనివారం 58.37 కోట్లు రాబట్టింది. రెండు రోజులకు మిగతా భాషల్లో యానిమల్ రూ. 17.95 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇండియా వైడ్ అన్ని భాషల్లో యానిమల్ రూ. 131.07 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.

ఇక మూడో రోజు యానిమల్ ఇండియాలో రూ. 72.5 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. వీకెండ్ ముగిసే నాటికి యానిమల్ రూ. 200 కోట్ల మార్క్ దాటేసింది. ఇక యూఎస్ లో ఊహించని రెస్పాన్స్ దక్కుతుంది. నార్త్ అమెరికాలో యానిమల్ $6 మిలియన్ మార్క్ చేరుకుంది. $4 మిలియన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన యానిమల్ మూడో రోజుకే లాభాలు తెచ్చిపెట్టింది. ఇక యానిమల్ ఏ స్థాయిలో లాభాలు పంచనుందో అర్థం చేసుకోవచ్చు.

ఒక్క యూఎస్ లో యానిమల్ వసూళ్లు రూ. 41.39 కోట్లకు చేరాయి. బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో పాటు ఓవర్సీస్ లో విపరీతమైన రెస్పాన్స్ దక్కుతుంది. యానిమల్ మూవీ ఊహించని రికార్డులు నమోదు చేయడం ఖాయం. రన్బీర్ కపూర్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రష్మిక మందాన హీరోయిన్. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక రోల్స్ చేశారు. సందీప్ రెడ్డి వంగ హ్యాట్రిక్ పూర్తి చేశారు.