NTR: ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది త్రిప్తి డిమ్రీ. ఆమెకు ఈ సినిమా ఎక్కడలేని ఫేమ్ తెచ్చిపెట్టింది. త్రిప్తి డిమ్రీ పాత్ర నిడివి చాలా తక్కువ. అయితే కథలో కీలకమైన పాత్ర అది. మెయిన్ విలన్ కుట్రలో భాగంగా హీరో రన్బీర్ వద్దకు వస్తుంది. తొలిచూపులోనే రన్బీర్ ఈమె మాయలో పడిపోతాడు. భార్యా పిల్లలను వదిలేసి కొన్ని రోజులు ఆమెతో ఉండిపోతాడు. త్రిప్తి పూర్తి నగ్నంగా ఈ చిత్రంలో నటించింది. ఈ మూవీలో ఆమెకు ఘాడమైన ముద్దు సన్నివేశాలు కూడా ఉన్నాయి.
త్రిప్తి ఇంత పాపులర్ కావడానికి కారణం ఇదే. మీడియాలో ఆమె గురించి వరుస కథనాలు వెలువడ్డాయి. త్రిప్తి గురించి తెలుసుకునేందుకు జనాలు ఆసక్తిచూపారు. మీడియా సంస్థలు ఆమె ఇంటర్వ్యూలు కోసం ఎగబడుతున్నారు. యానిమల్ మూవీతో తనకు వచ్చిన గుర్తింపుకు హ్యాపీగా ఉందని ఆమె అంటున్నారు. పబ్లిక్ లో కనిపిస్తే యానిమల్ బ్యూటీ అంటూ సెల్ఫీల కోసం ఎగబడతారు.
కాగా లేటెస్ట్ ఇంటర్వ్యూలో త్రిప్తి ఓ క్రేజీ కామెంట్ చేసింది. సౌత్ ఇండియా హీరోల్లో ఎవరితో నువ్వు జతకట్టాలని భావిస్తున్నావని ఆమెను అడిగారు. త్రిప్తి తడుముకోకుండా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పింది. ఆర్ ఆర్ ఆర్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. త్రిప్తి కామెంట్స్ వైరల్ అవుతుండగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు .
యానిమల్ చిత్రానికి సీక్వెల్ ఉన్న విషయం తెలిసిందే. యానిమల్ పార్క్ పేరుతో మరో పార్ట్ తెరకెక్కించనున్నారు. యానిమల్ ఎండ్ టైటిల్స్ ద్వారా ఈ విషయం స్పష్టం చేశారు. యానిమల్ పార్క్ మూవీలో త్రిప్తి రోల్ కీలకంగా ఉంటుందట. ఆమెకు ఫేమ్ వచ్చిన నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగ పాత్ర నిడివి పెంచనున్నాడట. యానిమల్ మూవీలో రన్బీర్ కపూర్ హీరోగా నటించాడు. రష్మిక మందాన జంటగా నటించింది. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక రోల్స్ చేశారు. వరల్డ్ వైడ్ రూ. 800 కోట్ల వసూళ్లు సాధించింది.