Anil Ravipudi Success Secret: కమర్షియల్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించగలిగే కెపాసిటి ఉన్న దర్శకులలో అనిల్ రావిప్పుడు మొదటి స్థానంలో ఉంటాడు. ఇప్పటివరకు త్రిబుల్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన ఆయన తన సక్సెస్ ఫార్ములా గురించి ఓపెన్ గా చెప్పాడు…తను ఏ హీరో తో అయితే సినిమా చేస్తాడో ఆ హీరోకు సంబంధించిన వింటేజ్ లుక్ ను గాని, గత సినిమా ఆక్టివిటీస్ గాని ఆ సినిమాలో చేర్చి అతని బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కథలు రాసుకుంటానని గతంలో చాలా సందర్భాల్లో తెలియజేశాడు. అలాగే కామెడీని సైతం చాలా డీసెంట్ గా ప్రజెంట్ చేసి సక్సెస్ ను సాధిస్తాడు. ఇదే నా సక్సెస్ ఫార్ములా అని అనిల్ రావిపూడి చెబుతున్నాడు. ఇక ఇప్పటివరకు అతను స్టార్ హీరోలందరితో సినిమాలను చేసి వాళ్ళందరికి సక్సెస్ లను కట్టబెడుతున్నాడు.
ఇక సీనియర్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లతో ఇప్పటివరకు సినిమాలను చేసి సక్సెస్ లను అందించిన దర్శకులైతే లేరు. కానీ అనిల్ రావిపూడి ఇప్పటివరకు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో సినిమాలు చేశాడు. ఇక నాగార్జున మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాడు. అతనితో కూడా సినిమాను చేసి తనకి భారీ సక్సెస్ ని కట్టబెట్టాలని అనిల్ రావిపూడి ప్రయత్నం చేస్తున్నాడు.
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు కూడా ఈ నలుగురు హీరోలకు సక్సెస్ లను కట్టబెట్టినవారు లేరు. కాబట్టి ఈతరం డైరెక్టర్లలో వాళ్ళందరికి సక్సెస్ లను అందించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి చరిత్రలో నిలిచిపోతాడనే ఉద్దేశ్యంతో ముందుకు అడుగులు వేస్తున్నాడు… ఇక నాగార్జున సైతం ప్రస్తుతం తన వందో సినిమా చేస్తున్నాడు.
కాబట్టి ఇప్పుడు నాగార్జున అనిల్ రావిపూడి కి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. ఫ్యూచర్లో సినిమా చేసే అవకాశం ఉందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే అనిల్ రావిపూడి తన తర్వాత సినిమాని సైతం 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఆ సినిమాతో సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…