Anil Ravipudi Comments On Nayanthara: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా రీసెంట్ గా రిలీజై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతుంది. ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని అనిల్ చెప్పడంతో మొదట సినిమా యూనిట్ వాళ్ళు నయనతార ను ఈ సినిమా కోసం సంప్రదించినప్పటికి ఆమె ఈ సినిమాను చేయనని చెప్పిందట… అనిల్ రావిపూడి నేను ఒకసారి ట్రై చేస్తానని చెప్పి నయనతారతో ఫోన్ లో మాట్లాడి కథ మొత్తం చెప్పాడట…స్టోరీ విన్న నయనతార అనిల్ గారు కథ బాగుంది. కానీ నేను ఈ సినిమాను చేయలేనని చెప్పిందట. దానికి అనిల్ రావిపూడి స్పందిస్తూ మేడం ఒక్కసారి ఆలోచించండి.. మీరు చేస్తే బావుంటుంది అని చెప్పారట. దాంతో నయనతార ఒకవేళ నేను ఈ సినిమా చేయనని కరాకండగా చెప్పేస్తే ఏం చేస్తావు అని అడిగిందట.
దాంతో అనిల్ రావిపూడి ఏముంది దృశ్యం సినిమాలో ఏం జరిగిందో అదే చేస్తాను అని చెప్పారట. ఒక్కసారిగా షాక్ అయిన నయనతార ఏంటి? ఏం చేస్తావ్ అని అడిగితే దృశ్యం సినిమాలో వెంకటేష్ తన ఫ్యామిలీ మొత్తాన్ని సేవ చేయడానికి మనం ఆరోజు టెంపుల్ కి వెళ్ళలేదు. ప్రయాణం చేయలేదు…
మనం ప్రయాణించిన విషయాలను మర్చిపోండి అని చెప్పినట్టుగా నేను కూడా నయనతార నా సినిమాలో చేయనని నాకు చెప్పలేదు. అంటూ వాటన్నింటిని మర్చిపోతానని చెప్పారట. దాంతో నయనతార నవ్వుకొని అప్పుడే సరే నేను చేస్తాను అని చెప్పిందట. మొత్తానికైతే ఈ సినిమాలో నయనతార పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంది…
ఇక ఆన్ స్క్రీన్ లో మెగాస్టార్ కి జోడిగా నయనతార చాలా బాగా సెట్ అయ్యారు. భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించింది. అయినప్పటికి ఈ సినిమాలో భార్యగా నటించి ప్రేక్షకులందరిని మెప్పించింది. ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి చేసిన ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరిని మెప్పించడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…