Anil Ravipudi Comments On Chiranjeevi: ‘భోళా శంకర్’ లాంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కొంత గ్యాప్ తీసుకొని చేస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankar Vara Prasad Garu). ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం నుండి విడుదలైన రెండు పాటలు ఒక దానిని మించి ఒకటి హిట్ అవ్వడం తో అంచనాలు ట్రిపుల్ అయ్యాయి. అయితే రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అవ్వడం తో అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, ఈ చిత్రాన్ని జనవరి 12 న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. అయితే అనిల్ రావిపూడి సినిమా అంటే ప్రొమోషన్స్ ఏ రేంజ్ లో చేస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
సంక్రాంతి వస్తున్నాం చిత్రం అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి ప్రొమోషన్స్. ఏ టీవీ ఛానల్ పెట్టినా ఈ మూవీ టీం నే కనిపించేది. ఈసారి కూడా ఆ రేంజ్ లో ప్రొమోషన్స్ ప్లాన్ చేస్తున్నారా అని అనిల్ రావిపూడి ని అడగ్గా, ఈసారి అలా కాకుండా కాస్త కొత్తగా చెయ్యాలని ఆలోచిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా విడుదలకు ముందు చేసే ప్రొమోషన్స్ కంటే ఎక్కువగా, విడుదల తర్వాత చేసే ప్రొమోషన్స్ పై ఈసారి ఎక్కువ ద్రుష్టి పెట్టాము అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. రీసెంట్ గా ఆయన ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా స్టోరీ చెప్పగానే చిరంజీవి గారు నేను సాల్ట్ & పెప్పర్ లుక్ లో కనిపిస్తాను నీకు పర్లేదు అని అడిగాడు. అందుకు నేను చిరంజీవి గారితో , ఆ అవసరం లేదు సార్. మీరు ఈ వయస్సులో కూడా ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు కాలం నాటి చిరంజీవి లాగానే కనిపిస్తున్నారు. అలాంటి మిమ్మల్ని నేనెందుకు సాల్ట్ & పెప్పర్ లుక్ లో చూపించాలని అనుకుంటాను?, నేను కేవలం మన పక్కింటి వ్యక్తి క్యారక్టర్ లో మాత్రమే మిమ్మల్ని చూపించాలని అనుకుంటున్నాను, అందుకు సాల్ట్ & పెప్పర్ లుక్ అవసరం లేదు అని చెప్పాను. అందుకు చిరంజీవి గారు సరే నీ ఇష్టం అన్నారు ‘ అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. ఇంకా ఆయన ఈ సినిమా గురించి చెప్పిన విశేషాలను ఈ క్రింది వీడియో లో చూసి తెలుసుకోండి.