Anil Ravipudi And Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను తీయగలిగే కెపాసిటీ కొందరికి మాత్రమే ఉంటుంది. అందులో అనిల్ రావిపూడి ఒకరు. కామెడీతోపాటు సగటు ప్రేక్షకులందరిని మెప్పించగలిగే అన్ని ఎలిమెంట్స్ అతని సినిమాలో ఉంటాయి. కామెడీ తో ప్రేక్షకులను అలరించి సినిమాలను సూపర్ సక్సెస్ చేస్తాడు… ఆయన సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్క ప్రేక్షకుడి మీద చిరునవ్వు ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది అనే పేరు ను సంపాదించుకున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో గొప్ప విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు చిరంజీవితో మన శంకర వర ప్రసాద్ అనే సినిమా చేస్తున్నాడు…ఇక రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.
గ్లోబ్ ట్రాటర్ పేరుతో నిర్వహించిన ఈవెంట్లో మహేష్ బాబు ఎంట్రీ అద్భుతంగా ఉందని అనిల్ రావిపూడి చెప్పాడు. ‘వారణాసి’ గ్లింప్స్ సైతం అద్భుతంగా ఉందని ఆ గ్లింప్స్ లో ప్రతి షాట్ ని చూస్తుంటే టైమ్ ట్రావెల్ చేసిన అనుభూతి మనకు కలుగుతుందని ఆయన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక వారణాసి గ్లింప్స్ వ మరోసారి రోజు మహేష్ బాబుకి కాల్ చేసి చాలా సేపు మాట్లాడానని కూడా అనిల్ చెప్పాడు. అత్యద్భుతమైన సినిమాని చేయాలంటే అది రాజమౌళి గారికే సొంతమని ఆయన విజన్ ఎల్లలు దాటిపోయిందని ఎంతమంది టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్న రాజమౌళి కి సపరేట్ స్టైల్ ఉంది. కాబట్టి ఆయన విజన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇక ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని ఆకర్షిస్తారు అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే. అందుకే మహేష్ బాబుకి అనిల్ రావిపూడి కి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. చూడాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నప్పటికి అది ఇప్పుడైతే వర్కౌట్ అయ్యే విధంగా కనిపించడం లేదు. ఫ్యూచర్లో తప్పకుండా వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుందని అనిల్ ఇంతకుముందు చాలా సందర్భాల్లో తెలియజేశాడు.