Anil Ravipudi Dance: టాలీవుడ్ లో రాజమౌళి(SS Rajamouli) తర్వాత నూటికి నూరు శాతం సక్సెస్ రఫేటే ఉన్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi). శ్రీను వైట్ల, హరీష్ శంకర్ వంటి డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనిల్ రావిపూడి, నేడు టాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే కామెడీ జానర్ సినిమాలు తీయడం లో సిద్ధహస్తుడు అని నిరూపించుకున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్టర్ అయితే చాలు, హీరో ఎవరో కూడా చూడకుండా థియేటర్స్ కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ రేంజ్ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ‘పటాస్’ చిత్రం తో డైరెక్టర్ గా మొదలైన ఆయన ప్రయాణం, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తో ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. ఏకంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్’ సినిమాతో ఏకంగా 400 కోట్ల గ్రాస్ పై టార్గెట్ పెట్టాడు.
ఈ చిత్రం లోని ‘మెగా విక్టరీ మాస్’ పాటని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి డ్యాన్స్ వేస్తుంటే చూసేందుకు రెండు కళ్ళు చాలలేదు. ఒక జనరేషన్ కి చెందిన ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ తో ఇలాంటి స్టెప్పులు వేయించాలంటే అనిల్ రావిపూడి వల్లే అవుతుంది. అయితే అనిల్ రావిపూడి కి కూడా డ్యాన్స్ అద్భుతంగా వచ్చు అనే విషయం మన అందరికీ తెలిసిందే. హీరోలతో సమానంగా ఆయన డ్యాన్స్ వేయగలడు. నేడు ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ ని ఆయన విజ్ఞాన్ యూనివర్సిటీ లో విడుదల చేసాడు. అక్కడ ఆయన విద్యార్థులతో కలిసి వేసిన స్టెప్పులు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. చిరంజీవి, వెంకటేష్ లను కూడా డామినేట్ చేసాడంటే అతిశయోక్తి కాదేమో, ఆ రేంజ్ ఎనర్జీ తో వేసాడు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మీరు కూడా ఆ వీడియో ని క్రింద చూసేయండి. ఇకపోతే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ భారీ రేంజ్ లో జరిగాయి. ఓటీటీ రైట్స్ కూడా అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని కూడా మొదలు పెట్టేసారు. నార్త్ అమెరికా నుండి అప్పుడే లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లు క్లూడా వచ్చాయి. వచ్చే నెల 4 న ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చేయబోతున్నారు. అంతే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నాడు.
.@AnilRavipudi dance pic.twitter.com/62TJoN6J01
— T2BLive.COM (@T2BLive) December 30, 2025