హోమ్లీ బ్యూటీ ‘ఆండ్రియా జెరెమియా’ తెగ సీరియస్ అవుతుంది. తానెంత జాగ్రత్తగా ఉన్నా ఎంత పద్దతిగా ఉన్నా తన గురించి మీడియా ఇష్టమొచ్చినట్లు రాస్తోంది అంటూ ఈ ముద్దుగుమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్, ఇలాంటి రూమర్ల బారిన పడి కొందరు సినిమాలకు దూరం అయ్యారని, మరికొందరు ఇంకా చెత్త పుకార్ల కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చింది ఆండ్రియా.
ఇంతకీ ఆండ్రియా ఆవేదనకు కారణం ఏమిటంటే.. ఆ మధ్య ఆండ్రియా పై ఒక బోల్డ్ న్యూస్ బాగా వైరల్ అయింది. ఈ కోలీవుడ్ ముదురు భామ న్యూడ్ సీన్స్ లో నటించబోతోంది అనేదే ఆ న్యూస్ సారాంశం. అయితే ఆండ్రియా ఆ వార్త పై స్పందిస్తూ.. ఎలాంటి పాత్రలు పడితే అలాంటి పాత్రలలో నటించడానికి నేను సిద్ధంగా లేను.
నాకు అంటూ ఒక ఇమేజ్ ఉంది. నేను డబ్బులు ఎక్కువ ఇస్తున్నారని, నా ఇమేజ్ ను పాడు చేసుకోలేను. అయినా న్యూడ్ సీన్స్ లో నటిస్తాను అని ఎలా అనుకున్నారు. పైగా ఎలాంటి సీన్స్ లోనైనా నేను నటిస్తాను అని నేనే చెప్పినట్టు కొన్ని పత్రికలు రాశాయి. ఇది చాల దారుణం. నా వ్యవహార శైలి గురించి, నా పద్దతి గురించి మీకు తెలియదు.
నేను ఏది పడితే అది చేయను’ అంటూ చెప్పుకొచ్చింది ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ. మొత్తానికి ఆండ్రియా నుండి ఇలాంటి రియాక్షన్ ఊహించని ఆమె అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఆండ్రియా గ్లామర్ షో కోసం వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారట. ఆండ్రియా ఇప్పుడు ఇలా చెప్పడం మాకు తీవ్రంగా బాధ కలిగించింది అని వారు కామెంట్స్ కూడా పెడుతున్నారు.