Andhra King Taluka OTT: రామ్ పోతినేని(Ram Pothineni) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka) చిత్రం నిన్న విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ టాక్ కి తగ్గట్టే డీసెంట్ రేంజ్ ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. 2010 వ సంవత్సరం లోనే తెలుగు రాష్ట్రాల నుండి మొదటి రోజు నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన రామ్ కి , 2025 లో రెండున్నర కోటి రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టడం ఆయన రేంజ్ కి చాలా తక్కువే కానీ, గత చిత్రాల ప్రభావాన్ని తట్టుకొని ఈ మాత్రం షేర్ వసూళ్లు రావడం నిజం గా డీసెంట్ అనే చెప్పాలి. అయితే ఈ చిత్రాన్ని నిర్మించడం కోసం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దాదాపుగా 65 కోట్ల రూపాయిలను ఖర్చు చేశారు.
థియేట్రికల్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 23 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. మొదటి రోజు షేర్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల 50 లక్షల రూపాయిలు వచ్చాయి. థియేట్రికల్ రన్ తో 65 కోట్ల రూపాయిలు రీకవరీ అవ్వడం అసాధ్యమే, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ నాన్ థియేట్రికల్ రైట్స్ తో ఈ చిత్రం బడ్జెట్ మొత్తం రీకవర్ అయ్యిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఒకప్పటి లాగా ఓటీటీ రైట్స్ ఈమధ్య అమ్ముడుపోవడం లేదు అనేది వాస్తవం. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ బాగా తగ్గిపోయింది కాబట్టి. కేవలం థియేటర్స్ లో విడుదలై, పాజిటివ్ టాక్ వస్తే మంచి ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేస్తున్నారు. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రానికి కూడా విడుదలకు ముందు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోలేదు. కానీ విడుదలై పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత మాత్రం ఈ సినిమా రైట్స్ ని 30 కోట్ల రూపాయలకు నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
అలా థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ కలిపి, ఆడియో రైట్స్ మినహాయిస్తూ ఈ చిత్రానికి 53 కోట్ల రూపాయిల వరకు బడ్జెట్ రీకవరీ అయ్యింది. ఆడియో కూడా పెద్ద హిట్ కాబట్టి, కనీసం 7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి ఉండొచ్చు. అలా నిర్మాత పెట్టిన డబ్బులతో 60 కోట్ల రూపాయిలు రికవరీ అయ్యాయి. కేవలం 5 కోట్ల రూపాయిలు మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఈ వీకెండ్ కి థియేటర్స్ నుండి ఈ చిత్రం కచ్చితంగా 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొదటి వారం కచ్చితం గా బ్రేక్ ఈవెన్ మార్జ్కుని దాటి లాభాల్లోకి వస్తుంది. ఫుల్ రన్ లో ఈ చిత్రం 32 నుండి 35 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో వచ్చే నెల 25 వ తారీఖు నుండి అందుబాటులోకి రానుంది.