Andhra King Taluka Director: ఒక వారంలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి అనే దాని కంటే మంచి సినిమాలు ఎన్ని వచ్చాయి అనేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది…స్టార్ హీరోలు తమ హీరోయిజాన్ని చూపించుకుంటూ చేసిన సినిమాలు కంటే ఎమోషన్స్ తో ప్రేక్షకులను మెప్పించిన సినిమాలకే ఎక్కువ గుర్తింపైతే ఉంటుంది. అలాగే రామ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్ హీరో ఇంతకు ముందు మాస్ జపం చేసినప్పటికి ఇప్పుడు తన పంథా ను మార్చి ఒక కంటెంట్ ఉన్న సినిమా చేయడం అనేది ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఒక హీరోకి అభిమానికి మధ్య ఉండే రిలేషన్ షిప్ ఎలా ఉంటుంది. హీరో తన అభిమానుల గురించి ఎలా ఆలోచిస్తాడు. అభిమానులు తమ హీరోకి కష్టమొస్తే ఎలా తల్లడిల్లిపోతారు అనేది ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా చూపించాడు. ఇక ఈ సినిమాలో నటించినందుకు గాను రామ్ కి ఎంత పేరు వస్తుందో ఈ సినిమాని డైరెక్ట్ చేసిన మహేష్ బాబుకి సైతం అంత గొప్ప పేరైతే వస్తోంది. నిజానికి రామ్ క్యారెక్టర్ ను దర్శకుడు స్క్రీన్ మీద బాగా పండించాడు. మొత్తానికైతే హీరో పాత్రలో ఉపేంద్ర క్యారెక్టర్ ని ఎలాగైతే రాసుకున్నాడో, అలాగే రామ్ క్యారెక్టర్ ను ఒక అభిమాని ధోరణిలో చూపించాడు. ఇక రామ్ సైతం తనకి తెలియకుండానే ఆ పాత్రలో ఒక డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు…
‘సూర్యుడు, సముద్రం ఎప్పటికి కలవవు కానీ చూడ్డానికి బాగుంటాయి’. అనే లైన్ తో ఈ సినిమా స్టోరీ మొత్తం చెప్పేసాడు. ముఖ్యంగా ఉపేంద్ర గారి నటన కూడా ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. హీరో, అభిమాని మధ్య రియల్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చాలా పర్ఫెక్ట్ గా చూపించారు. ప్రతి ఒక్క అభిమాని ఈ సినిమాను చూస్తే తన హీరో పట్ల తను ఎలా ఆలోచిస్తున్నాడో ఇందులో కూడా అలానే ఉంటుంది.
ఒక రకంగా స్క్రీన్ మీద ప్రతి అభిమాని తనను తాలేని చూసుకుంటాడు… అందుకే ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతోంది. ముఖ్యంగా ఈ లైన్ ని ఎంచుకోవడం అనేది చాలా సాహసమనే చెప్పాలి. హీరోకి, అభిమానికి మధ్య ఉండే రిలేషన్ ని దర్శకుడు ఎలా చూపిస్తాడు అనేది మొదటి నుంచి కూడా అందరి మదిలో మెదులుతున్న ఒక ప్రశ్న… కానీ డైరెక్టర్ ఆ కత్తి మీద సాము లాంటి కథకి తన స్టైల్ లో డైరెక్షన్ చేసి ప్రేక్షకులను ఎమోషన్స్ తో కట్టిపడేశాడు.
క్లైమాక్స్ సన్నివేశం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి…ఒక పొటెన్షియాలిటి ఉన్న దర్శకుడు ఎలాంటి కథనైనా సరే సెన్సిబుల్ గా హ్యాండిల్ చేస్తారని చెప్పడానికి మహేష్ బాబుని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. మొత్తానికైతే రామ్, ఉపేంద్ర ఈ సినిమాకి ప్రాణం పోశారు. అలాగే దర్శకుడు ఈ సినిమాని చాలా చక్కగా తెరకెక్కించారు…