Anchor Vishnu Priya: ఈరోజుల్లో సెలబ్రెటీలు కావడానికి పెద్దగా సమయం పట్టడం లేదు. సోషల్ మీడియా పుణ్యంతో చాలా మంది వెలుగులోకి వస్తున్నారు. ఇలాగే కొందరు పాపులర్ అయి సినీ రంగంలో అడుగుపెడుతున్నారు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తరువాత హాట్ భామగా గుర్తింపు తెచ్చుకుంది విష్ణుప్రియ. సినిమాల్లో నటించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. సినిమాల్లో అవకాశాలు అయితే రాలేదు. కానీ ఆమె సోషల్ మీడియా ద్వారా స్పెషల్ గా గుర్తింపు తెచ్చుకుంది. నిత్యం హాట్ హాట్ పిక్స్ ను అప్లోడ్ చేస్తూ అందరినీ అలరిస్తోంది. ఒక దశలో విష్ణు ప్రియ లేటేస్ట్ పిక్స్ కోసం కొందరు అభిమానులు ఎదురూచూస్తు ఉంటారు. ఈ తరుణంలో విష్ణు ప్రియకు సంబంధించిన లేటేస్ట్ వీడియో హల్ చల్ చేస్తోంది.
విష్ణు ప్రియ యాంకర్ గానే కాకుండా డ్యాన్స్ లోనూ ప్రతిభ ఉందన్న విషయం ప్రూవ్ చేసింది. కొన్ని నెలల కిందట ఆమె ‘జర్రీ జర్రీ’ అనే సాంగ్ లో చేసిన డ్యాన్స్ తో యూత్ ఫిదా అయ్యారు. ఇందులో విష్ణుప్రియ నడుం తిప్పడం చూసి పెద్ద పెద్ద డ్యాన్సర్లు సైతం షాక్ అయ్యారు.అయితే ఆ తరువాత విష్ణుప్రియకు సినిమాల్లో అవకాశం వస్తుందని అనుకున్నారు. కానీ ఇప్టికీ అమ్మడును ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన ప్రతాపం చూపిస్తోంది.
తాజాగా విష్ణు ప్రియ లేటేస్టుగా ఓ సాంగ్ కు నడుం తిప్పుడూ హంగామా చేసింది. పొట్టి గౌనులో ఆమె డ్యాన్స్ చేస్తుంటే కుర్రాళ్లు షాక్ అయ్యారు. అందాలన్నీ ఆరబోస్తూ ఏమాత్రం బెరుకు లేకుండా డ్యాన్స్ చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా చాలా మంది విష్ణు ప్రియను ఉద్దేశించి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా తనను సినిమాల్లోకి తీసుకోండి.. అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram