Anchor Suma: తెలుగు బుల్లితెరపై వ్యాఖ్యాత ఎవరంటే ఠక్కున సమాధానం వచ్చే పేరు సుమ. అంతలా ప్రేక్షకులతో పరిచయం ఆమెది. మలయాళీ అయినా తెలుగులో తన వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంటోంది. ఏ కార్యక్రమమైనా సుమ ఉండాల్సిందే. అంటే ఆమె క్రేజీ ఎంత పెరిగిపోయిందో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తెలుగు తెరను శాసిస్తోంది. తన ప్రతిభతో ఎన్నో అవకాశాలను రాబట్టుకుంటోంది. ఎందరో వ్యాఖ్యాతలున్నా సుమది మాత్రం ప్రత్యేక స్థానమే అని చెప్పుకోవచ్చు. ఆమె మాటలకు తెలుగు ప్రేక్షకులు అంతలా హత్తుకుపోయారు.

తన గ్లామర్ తో తెలుగు బుల్లితెర తనదైన శైలిలో దూసుకుపోతోంది. అవకాశాలను తెచ్చుకోవడమే కాదు దానికి న్యాయం చేస్తూ తగిన పారితోషికం అందుకుంటున్న సుమ ఇటీవల ఓ ఆసక్తికర విషయం వెల్లడించింది. తన ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతున్న ఓ వ్యాధి గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరచింది. తనకు ఎప్పటి నుంచో ఉన్న ఆ వ్యాధి పై ఇప్పటివరకు దాచి ఉంచింది. కానీ ఇక దాచే అవసరం లేదని చెబుతోంది. చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించి అందరని ఆశ్చర్యపరచింది.
సినిమా ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ లాంటి స్పెషల్ ఏదైనా సుమ ఉండాల్సిందే. తన హావభావాలతో అందరిని ఆకట్టుకునే సుమ యాంకరింగ్ ను అందరు ప్రశంసిస్తారు. తన మాటలతో అందరిని ఆకట్టుకుంటోంది. మరో వైపు యూట్యూబ్ చానళ్లలో కూడా తన పదునైన మాటలతో సత్తా చాటుతోంది. తెలుగు తెరపై తన ప్రభావాన్ని చూపిస్తోంది. యాంకరింగ్ లో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది.
కీరాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది పెద్ద సమస్య కాకపోయినా తగ్గడం లేదని చెబుతోంది. ప్రస్తుతం ఈ వ్యాధి శరీరంలో భాగమైపోయిదని చెప్పింది. ఎంతో సరదాగా ఉండే సుమ కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడటంతో ప్రేక్షకులు ఆవేదన చెందుతున్నారు. వాక్చాతుర్యంతో ఎదుటి వారిని మెప్పించే ఆమెలో ఇంత ఆవేదన దాగి ఉందా అని మథన పడుతున్నారు.