Anchor Sreemukhi: బుల్లితెరపై శ్రీముఖి ఏకఛత్రాధిపత్యం చేస్తుంది. లెజెండరీ యాంకర్ సుమను కూడా శ్రీముఖి దాటేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. దాదాపు అరడజను షోలకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు టాప్ ఫైవ్ లో కూడా లేని శ్రీముఖి నంబర్ వన్ పొజిషన్ కైవసం చేసుకోవడం నిజంగా ఉహించని పరిమాణం.

శ్రీముఖి అనతికాలంలో ఎదిగారని చెప్పొచ్చు. హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన శ్రీముఖి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమెకు క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులు కూడా ఎదురయ్యాయట. ఆఫర్ ఇస్తా పక్కలోకి వస్తావా? అని ఓ డైరెక్టర్ అడిగాడని శ్రీముఖి గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎంతకూ సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ రాకపోవడంతో శ్రీముఖి యాంకర్ గా మారారు.
ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ షోతో శ్రీముఖి యాంకర్ అయ్యారు. మేల్ యాంకర్ రవితో పాటు శ్రీముఖి యాంకర్ బాధ్యతలు నిర్వర్తించారు. స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తో వచ్చిన పటాస్ పర్లేదు అనిపించింది. ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. తనకంటూ స్పెషల్ మేనరిజం డెవలప్ చేసుకుంటూ వచ్చిన శ్రీముఖి స్టార్ అయ్యారు.

బిగ్ బాస్ షోకి వెళ్లడం కూడా శ్రీముఖికి ప్లస్ అయ్యింది. 2019లో ప్రసారమైన సీజన్ 3లో శ్రీముఖి కంటెస్ట్ చేశారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిరూపించుకున్న శ్రీముఖి ఫైనల్ కి వెళ్లారు. ఆ సీజన్ రన్నర్ గా నిలిచారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ అయ్యారు. టైటిల్ దూరమైనప్పటికీ రెమ్యూనరేషన్ రూపంలో శ్రీముఖి గట్టిగా రాబట్టారు. అలాగే సదరు షో కెరీర్ కి ప్లస్ అయ్యింది.
స్టార్ మా పరివార్, జాతిరత్నాలు, మిస్టర్ అండ్ మిసెస్, బీబీ జోడితో పాటు ఒకటి రెండు షోలకు శ్రీముఖి యాంకర్ గా ఉన్నారు. అనసూయ యాంకరింగ్ మానేయడం శ్రీముఖికి ప్లస్ అయ్యింది. రష్మీ ఉన్నప్పటికీ ఆమె మల్లెమాల అగ్రిమెంట్ లో బందీగా ఉన్నారు. ఇతర ఛానెల్స్ లో షోలు చేయరు. నటిగా కూడా బిజీ అవుతున్న శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా వేడి పెంచేస్తుంది. తాజాగా పాల రోజా కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి హొయలు పోయింది. శ్రీముఖి సాలిడ్ గ్లామర్ కిరాక్ పుట్టిస్తుంది.

క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. మ్యాస్ట్రోతో పాటు పలు చిత్రాల్లో చిన్న చిత్ర పాత్రలు చేశారు. యాంకర్ గా రాణిస్తూనే హీరోయిన్ గా సెటిల్ అవ్వాలనేది శ్రీముఖి ప్లాన్. అందుకే మొహమాటం లేకుండా స్కిన్ షో చేస్తూ మేకర్స్ కి ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.