Homeఎంటర్టైన్మెంట్Anchor Anasuya: జిమ్‌లో కొవ్వు కరిగిస్తున్న అనసూయ.. యాంకర్‌ హాట్‌ వర్కౌట్‌ పిక్స్‌ వైరల్‌!

Anchor Anasuya: జిమ్‌లో కొవ్వు కరిగిస్తున్న అనసూయ.. యాంకర్‌ హాట్‌ వర్కౌట్‌ పిక్స్‌ వైరల్‌!

Anchor Anasuya: యాంకర్‌ అనసూయ.. ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందచందాలతోపాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తోంది. ఈ హాట్‌ యాంకర్‌ తాజాగా కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తోన్న ఈ పిక్స్‌ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

పొట్టి బట్టల్లో..
జిమ్‌లో శరీరంలోని కొవ్వును కరిగిస్తున్న అనసూయ.. జిమ్‌లోనూ అందాలు ఆరబోసింది. పొట్టి నిక్కర్, టీషర్ట్‌ ధరించి.. ఎక్సర్సైజ్‌ చేసింది. కాళ్లకు షూ ధరించి.. ఓ కాలు పైకి ఎత్తి అద్దం ముందు కూర్చుని సెల్ఫీ దిగింది. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అనసూయ జిమ్‌ అందాలకు ఫాలోవర్స్‌ ఫిదా అవుతున్నారు. ఇటీవలో బికినీ ఫొటోలు, వీడియోలతో అభిమానులకు అందాల విందు చేసిన అనసూయ తాజా ఫొటోలు కూడా హాట్‌గా ఉన్నాయి.

ఇటీవలే విమానం సినిమా విడుదల
అనసూయ నటించిన విమానం సినిమా ఇటీవల విడుదలైంది. సముద్రఖని ప్రధాన పాత్రలో నటించారు. సుమతి అనే వేశ్య పాత్రలో నటించిన అనసూయ చిన్న పాత్రే అయినా ఓ పక్క గ్లామర్‌ షో చేస్తూనే మరోపక్క ఇంటిమేట్‌ సన్నివేశాల్లో అదరగొట్టింది. ఈ సినిమాలో అనసూయ కొన్ని ఘాటైన శృంగార సన్నివేశాల్లో నటించినప్పటికీ.. ఆ తర్వాత ఆమె కోరిక మేరకు వాటిని సినిమా నుంచి తొలగించినట్లు సమాచారం. క్లైమాక్స్‌ లో వచ్చే ఒక్క సీన్లో తప్ప అనసూయ పాత్రకి.. ఈ సినిమా కథకి అస్సలు సంబంధం లేదు. ఆ విధంగా అనసూయ అందాలు ఆరబోసిన సినిమాకు పెద్దగా ఉపయోగంలేకుండా పోయింది.

సమ్మర్‌ వెకేషన్‌లో అందాల ఆరబోత..
ఇక యాంకర్‌ అనసూయ ఇటీవల తన భర్తతో విదేశాల్లో వెకేషన్‌కు వెళ్లింది. తన పెళ్లి రోజు కావడంతో భర్తతో ఎంజాయ్‌ చేస్తూ.. కొన్ని ఫొటోలను, వీడియోలను పంచుకుంది. అయితే ఈ ఫోటోలపై నెటిజన్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక చాలు అనసూయ.. నీ బికినీ ఫొటోలు.. ఆపు అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. మరికొందరమో.. ఈ ఏజ్‌లో కూడా అంత ఫిట్‌గా ఉండడం మామూలు విషయం కాదంటూ పొగిడారు. ఏది ఏమైనా మరోసారి ఆమె ట్రెండింగ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం ఆ పిక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

బాలయ్య సినిమాలో చాన్స్‌..
ఇదిలా ఉంటే అనసూయ మరోసారి ఐటెమ్‌ సాంగ్‌లో కనిపించనుందని తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ, వీర సింహారెడ్డి సినిమా తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో భగవంత్‌ కేసరి ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక సమయంలో ఐటమ్‌ సాంగ్‌ ఉంటుందట. ఆ పాటలో మొదట మిల్కీ బ్యూటీ తమన్నాతో చేయించాలని దర్శకుడు అనిల్‌ రావిపూడి భావించారు. అయితే తమన్నా ఏకంగా కోటిన్నర రూపాయలను పారితోషికంగా డిమాండ్‌ చేయడంతో ఆమె ప్లేస్‌లో జబర్దస్త్‌ మాజీ యాంకర్‌ అనసూయని తీసుకుంటున్నారని సమాచారం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version