Anchor Anasuya: బుల్లితెరపై హొయలు పోతూ.. సెగలు రేపే హాట్ యాంకర్ అనసూయకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అప్పటి వరకు బుల్లితెరపై కేవలం యాంకరింగ్ మాత్రమే చేస్తే..

ఈమె గ్లామర్ యాంకరింగ్‌కు తెర లేపింది. స్టైలిష్ యాంకరింగ్ అంటే ఏంటో రుచి చూపించింది. తన ఒంపు సొంపులతో చూసే వారి కండ్లను కట్టిపడేస్తూ షోల రేటింగ్ కూడా పెంచింది.

అయితే కేవలం బుల్లితెరపై ప్రయాణం చేస్తే నడవదు అనుకుందో ఏమో తెలియదు గానీ.. ఇప్పుడు పెద్ద సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఏ ముహూర్తాన రంగస్థలం మూవీ చేసిందో గానీ.. అప్పుడే ఆమె దశ తిరిగింది. క్షణం లాంటి చిన్న సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన పుష్ప మూవీలో దాక్షాయణిగా భయపెట్టేసింది. పుష్ఫ-2లో ఈమె పాత్ర కీలకం అని తెలుస్తోంది.

Also Read: సొంత మరదళ్లను పెండ్లి చేసుకున్న స్టార్ హీరోలు వీరే..!
అయితే కెరీర్ పరంగా ఇంత బిజీగా ఉన్న ఈమె పర్సనల్ లైఫ్ గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఈమె ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత చిన్న చిన్న ఉద్యోగాల కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే సిక్స్ లాయిడ్ కంపెనీలో హెచ్ ఆర్ గా జాబ్ వచ్చింది. ఇలా జాబ్ చేస్తున్నప్పుడే ఆమెకు చాలామంది డైరెక్టర్లు సినిమా ఆఫర్లు ఇస్తామని చెప్పారంట.
ఇక ఆమెకు 15ఏండ్ల వయసులోనే ప్రేమ పుట్టిందంట. తన భర్త భరద్వాజ్‌ను ఎన్సీసీ క్యాంప్‌లో తొలిసారి కలిసిందంట. అలా వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారిందంట. కాగా ఇంట్లో వాళ్లను ఒప్పింటి మరీ వీరిద్దరూ పెండ్లి చేసుకున్నారంట. ఇక వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె బుల్లితెరతో పాటు వెండితెరపై రాణిస్తున్నారు.
Also Read: ఎన్టీఆర్ మూవీ దానవీరశూరకర్ణ 15రెట్లు లాభాలు తెచ్చిందట.. డైరెక్టర్ ఎవరంటే..?