Anasuya Bharadwaj: చీరలో అనసూయ సోగాయాల విందు… వేశ్య గెటప్ లో సూపర్ హాట్ గా స్టార్ యాంకర్!

తాజాగా ఆమె విమానం మూవీలో వేశ్య పాత్ర చేసింది. వేశ్య అంటే శరీరం కనిపించేలా బట్టలు ధరించాలి. శృంగార సన్నివేశాల్లో నటించాలి. కాబట్టి ఆ పాత్ర చేయడానికి చాలా మంది ఇష్టపడరు. చాలా కొద్దిమంది హీరోయిన్స్ మాత్రమే వేశ్య పాత్రలు చేశారు.

Written By: Shiva, Updated On : June 3, 2023 3:27 pm

Anasuya Bharadwaj

Follow us on

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ గట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమె బుల్లితెర ట్రెండ్ సెట్టర్ అనుకోవచ్చు. తెలుగు యాంకర్స్ స్కిన్ షో చేసింది లేదు. అనసూయతో ఆ సాంప్రదాయం ప్రారంభమైంది. జబర్దస్త్ షో వేదికగా అనసూయ పొట్టిబట్టల్లో అందాల విందు చేసింది. అనసూయ డ్రెస్సింగ్ విమర్శల పాలైంది. ఆమె డ్రెస్సింగ్ ని పలువురు తప్పుబట్టారు. తన బట్టలపై కామెంట్స్ చేసిన వాళ్లకు అనసూయ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తారు.

నా బట్టలు నా ఇష్టం. సౌకర్యం అనిపిస్తే ఎలాంటి బట్టలైనా వేసుకుంటాను. నా దుస్తుల గురించి మాట్లాడేందుకు మీరెవరు అంటుంది. ఆ మధ్య సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ… అనసూయ అందంగా ఉంటుంది. అలాంటి బట్టలు ధరించకపోయినా ఆమెను జనాలు చూస్తారు. పొట్టిబట్టలు ఎందుకు వేస్తుందని, అన్నారు. పెద్దవాడని కూడా చూడకుండా కోటాకు ఓ రేంజ్ లో ఇచ్చిపడేసింది. ఆయన మందు అలవాటును తెరపైకి తెస్తూ కౌంటర్లు వేసింది.

తాజాగా ఆమె విమానం మూవీలో వేశ్య పాత్ర చేసింది. వేశ్య అంటే శరీరం కనిపించేలా బట్టలు ధరించాలి. శృంగార సన్నివేశాల్లో నటించాలి. కాబట్టి ఆ పాత్ర చేయడానికి చాలా మంది ఇష్టపడరు. చాలా కొద్దిమంది హీరోయిన్స్ మాత్రమే వేశ్య పాత్రలు చేశారు. అనసూయ ఆ లిస్ట్ లో చేరారు. విమానం చిత్రంలో సుమతి అనే వేశ్యగా అనసూయ నటిస్తుంది. సుమతి గెటప్ లో ఫోటో షూట్ చేసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అనసూయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇక కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుండగా అనసూయ అనవసర వివాదాల్లో తలదూర్చుతుంది. ఇటీవల విజయ్ దేవరకొండను ఆమె ఉద్దేశపూర్వకంగా గెలికారు. ఖుషి చిత్ర పోస్టర్లో విజయ్ దేవరకొండ పేరు ముందు ది విజయ్ దేవరకొండ అని పెట్టడాన్ని ఆమె తప్పుబట్టారు. పైత్యం బాగా పెరిగిపోయిందంటూ ట్వీట్ చేసింది. దాంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. ఆమె మాత్రం వెనకాడలేదు. తిరిగి కౌంటర్స్ ఇచ్చే ప్రయత్నం చేసింది.