Anasuya Bharadwaj: అనసూయ కెరీర్ మూడు పూలు ఆరు కాయలుగా ఉంది. రెండు చేతులా సంపాదిస్తుంది. నటిగా బిజీగా ఉన్న అనసూయ భరద్వాజ్… ప్రొమోషన్ ఈవెంట్స్ లో సందడి చేస్తుంది. ఆమె తరచుగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళుతున్నారు. అనేక మంది వ్యాపారస్తులు అనసూయది లక్కీ హ్యాండ్ గా భావిస్తున్నారు. అందుకే కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా ఆమెనే ఓపెనింగ్ కి పిలుస్తున్నారు. ఒక షాప్ ఓపెన్ చేస్తే అనసూయ లక్షల్లో ఛార్జ్ చేస్తుంది. అనసూయకు ఇది మరో ఆదాయ మార్గం అయ్యింది.
అనసూయను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఆమె తమ నగరానికి వస్తుందంటే అక్కడికి చేరిపోతున్నారు. ఈ మధ్య అనసూయ ఏపీ/తెలంగాణాలలో పలు నగరాల్లో సంచరించింది. ఎక్కడికి వెళ్లినా ఆమెకు గ్రాండ్ వెల్కమ్ లభిస్తుంది. జబర్దస్త్ షో ద్వారా అనసూయ వెలుగులోకి వచ్చింది. కెరీర్ బిగినింగ్ లో ఆమె న్యూస్ రీడర్ గా కూడా చేసింది. కొన్ని సినిమాల్లో ప్రాధాన్యత లేని బ్యాక్ గ్రౌండ్ లో నిల్చునే రోల్స్ చేసింది.
జబర్దస్త్ ఆమె ఫేట్ మార్చేసింది. కెరీర్ కి గట్టి పునాది వేసింది. తెలుగు యాంకరింగ్ కి అనసూయ గ్లామర్ పరిచయం చేసింది. అనసూయ ముందు తరం హీరోయిన్స్ ఎవరూ స్కిన్ షో చేసింది లేదు. ఒకరకంగా చెప్పాలంటే ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. అనసూయ స్ఫూర్తితో రష్మీ, శ్రీముఖి, విష్ణుప్రియ, వర్షిణి హాట్ యాంకర్స్ గా ఎదిగారు. కాగా అనసూయ యాంకరింగ్ కి దూరమయ్యారు. ఇకపై బుల్లితెర మీద కనిపించేది లేదని తేల్చి చెప్పింది.
అయితే సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. వరుస ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కి గిలిగింతలు పెడుతుంది. తాజాగా పింక్ కలర్ చుడిదార్ లో సందడి చేసింది. అమ్మడు ట్రెడిషనల్ లుక్ వైరల్ గా మారింది. నిండైన బట్టల్లో కూడా అనసూయ అందాలు కవ్వించేలా ఉన్నాయి. దీంతో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ అనసూయ పుష్ప 2 మూవీలో లేడీ విలన్ గా కనిపించనుంది. ఈ క్రేజీ సీక్వెల్ ప్రాధాన్యత కలిగిన పాత్ర దక్కినట్లు ఆమె వెల్లడించారు.
View this post on Instagram