Anasuya- Tamannaah: సినిమా తీసే సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొన్ని కారణాల వల్ల ముందుగా అనుకున్న నటులు సరైన సమయానికి తప్పుకోవాల్సి వస్తోంది. ప్రతీ సినిమాకు హీరో, హీరోయిన్ ఇంపార్టెంట్ గా ఉంటారు. కానీ ఇటీవల స్పెషల్ సాంగ్స్ కు కూడా ప్రిఫరెన్స్ ఉండడంతో ఇందులో నటించేవారికి ప్రాధాన్యత పెరిగింది. ఈ సాంగ్ లో ఎవరు డ్యాన్స్ చేస్తారు? అన్న ఆసక్తి ఆడియన్స్ లో విపరీతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ దీని గురించి ముందే లీక్ చేస్తూ సినిమా పై అంచనాలు పెంచుతున్నారు. లేటేస్టుగా బాలయ్య #NBK108లో ప్రత్యేక సాంగ్ లో తమన్నా ఉంటుందని అన్నారు. కానీ అనూహ్యంగా అనసూయ పేరు తెరపైకి తీసుకొచ్చారు. అయితే తమన్నా స్థానంలో అనసూయను దించడానికి కారణమేంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది.
వీరసింహారెడ్డి సినిమా తరువాత బాలయ్య ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆయన నెక్ట్స్ మూవీ #NBK108ని అనిల్ రావిపూడి డైరెక్షన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఇందులో బాలయ్య ఇదివరకటి కంటే కొత్తగా కనిపించడంతో ఫ్యాన్స్ మూవీపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఇక ఇందులో బాలయ్యకు జోడిగా కాజల్ నటిస్తోంది. మరో బ్యూటీ శ్రీలీల బాలయ్యకు కూతురిగా నటిస్తుంది. బాలయ్య సినిమాలో స్పెషల్ సాంగ్స్ పెట్టాలని అనిల్ రావిపూడి నిర్ణయించారు. అయనతో తమన్నాతో స్టెప్పులు వేయించాలని అనుకున్నాడు.
ఈ నేపథ్యంలో తమన్నాను అడగగా ఈ మిల్క్ బ్యూటీ భారీగా డిమాండ్ చేసింది. ఇందులో నటించేందుకు అమ్మడు రూ.1.5 కోట్లు డిమాండ్ చేసిందట. ఒక్క సాంగ్ కోసం తమన్నా అంత రెమ్యూనరేషన్ అడగడంతో నిర్మాతలు షాకయ్యారట. ఇప్పుడున్న హీరోయిన్లలో సినిమా రెమ్యూనరేషన్ సైతం రూ.2 కోట్లు దాటడం లేదు. అలాంటిది ప్రత్యేక సాంగ్ కోసం తమన్నా డిమాండ్ చేయడంపై ఆలోచనలో పడ్డారట. దీంతో తమన్నా ప్లేసులో అనసూయకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారట.
అనసూయి ఇప్పటికే పలు స్పెషల్ సాంగ్స్ లో యాక్ట్ చేసింది. సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విన్నర్ లో ఈ భామ స్టెప్పులతో అదరగొట్టింది. అయితే ఆ తరువాత పలు పాత్రల్లో నటిస్తోంది. కానీ స్పెషల్ సాంగ్స్ లో డ్యాన్స్ చేసే అవకాశం రావడంతో ఏమాత్రం వదులుకోవద్దని అనుకుంటుందట. అటు మేకర్స్ సైతం అనసూయకు ప్రస్తుతం ఫాలోయింగ్ బాగానే ఉండడంతో ఈమెను తీసుకోవాలని అనుకుంటున్నారట. మరి అనసూయ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.