Anasuya family issue: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లతో సమానంగా కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులకు గుర్తింపు ఉంది. అలాంటి వారిలో అనసూయ ఒకరు. అందరిలాగే సైడ్ పాత్రల్లో నటించిన అనసూయ యాంకర్ గా గుర్తింపు పొందారు. జబర్దస్త్ అనే ప్రోగ్రాం ద్వారా స్టార్ అయిన ఈమె ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్లతో సమానంగా విశేష గుర్తింపును పొందారు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ రోల్ లో నటించిన అనసూయ.. మరికొన్ని సినిమాల్లో ప్రత్యేక సాంగ్ లో కనిపించి యూత్ ను బాగా అలరించింది. సినిమాలతోపాటు సోషల్ మీడియాలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈమె తన పర్సనల్ విషయాలను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా అనసూయ తన తండ్రి గురించి ఓ విషాదకరమైన విషయాన్ని చెప్పి అందరికీ కన్నీళ్లు తెప్పించింది. ఇంతకీ అనసూయ చెప్పిన ఆ విషాద విషయం ఏమిటంటే?
Also Read: హరి హర వీరమల్లు పవన్ కళ్యాణ్ కు ఏ రకంగా ఉపయోగపడనుంది…
అనసూయ తండ్రి సుదర్శన రావు దంపతులకు ముగ్గురు కూతుళ్లు. వీరిలో పెద్దమ్మాయి అనసూయ. సుదర్శన రావు గుర్రాల రేసు క్లబ్ లో ట్రైనర్ గా పనిచేసేవారు. అయితే ఈయన 2021లో మరణించారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడిన అనసూయ తండ్రి చికిత్స పొందుతూ మరణించారు. అయితే ప్రస్తుతం తన తండ్రి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంది. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ తో ఫ్యామిలీ మ్యాటర్ ను షేర్ చేసుకుంది.
తన తండ్రి సుదర్శన్ రావు కుటుంబ సభ్యుల మధ్య మోసపోయాడని పేర్కొంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఎంతోమందికి డబ్బు తానం చేసిన తన తండ్రి నీ కొందరు దగ్గర బంధువులే మోసం చేశారని పేర్కొంది. దీంతో ఆయన తీవ్ర దుఃఖంలో మునిగిపోయారని తెలిపింది. రేసు క్లబ్ లో పాల్గొన్న సమయంలో నాన్న వద్ద 12 గుర్రాలు ఉండేవని అనసూయ పేర్కొంది. అంతేకాకుండా సుదర్శన్ రావు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు.
ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ అనసూయ చెప్పిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. మోసం చేసిన వారికి తగిన శాస్తి తప్పకుండా ఉంటుందని.. త్వరలోనే ఆ దేవుడు వారిని శిక్షిస్తారని కామెంట్లు పెడుతున్నారు. సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో అనసూయకు క్రేజీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. దీంతో అనసూయ తన పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ అలరిస్తుంటుంది. తనకు ఫ్యాన్స్ తోనే సగం బలం అని చెప్పుకొని అనసూయ తనకు సంబంధించిన లేటెస్ట్ బ్యూటీ పిక్స్ కూడా షేర్ చేస్తూ వారిని అలరిస్తూ ఉంటుంది.
Also Read: చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాలో పెరిగిపోతున్న స్టార్ క్యాస్టింగ్…
వివిధ పాత్రల్లో కనిపించిన అనసూయ తనదైన శైలిలో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. కేవలం యాక్టర్ గాని కాకుండా డాన్సర్ గా కూడా హీరోయిన్లతో సమానంగా చేసి కుర్రకారకు ఊపు తెప్పిస్తుంది. ఇటీవల అనసూయ కొత్త ఇల్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచడం వల్ల పిక్స్ కు విపరీతమైన లైక్స్ వచ్చాయి.