Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. బోల్డ్ హీరోయిన్స్ ని మించి గ్లామర్ షో చేస్తుంది. తాజాగా ఆమె మరోసారి స్కిన్ షోతో గిలిగింతలు పెట్టింది. నడుము అందాలు హైలెట్ అయ్యేలా క్రేజీ ఫోజుల్లో కాక రేపింది. అనసూయ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అనసూయకు ఏమనిపిస్తే అది చేస్తుంది. ఒకరి ఆలోచనలు, నిర్ణయాల ఆధారంగా తన జీవితం ఉండదని గట్టిగానే చెబుతుంది. అనసూయ డ్రెస్సింగ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. జబర్దస్త్ షోలో ఆమె పొట్టి బట్టలు ధరించడం పై పలువురు ఆరోపణలు చేశారు.
ఎందరు ఏమన్నా అనసూయ మాత్రం తగ్గలేదు. పైగా తనని తాను సమర్ధించుకున్నారు. అసలు నేను ఎలాంటి బట్టలు ధరించాలో చెప్పేందుకు మీరెవరని ఎదురు ప్రశ్నించింది. నాకు కంఫర్ట్ అనిపిస్తే ఎలాంటి బట్టలైనా వేసుకుంటానని అనసూయ ఖరాకండిగా చెప్పారు. యాంకరింగ్ మానేయడంతో అనసూయ బుల్లితెర మీద కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తుంది.
తాజాగా ఒక గ్లామరస్ ఫోటో షూట్ షేర్ చేసిన అనసూయ స్ట్రాంగ్ కామెంట్ జోడించారు. ”ఒకరి నిర్ణయాల ఆధారంగా బ్రతకడం వదిలేశాక జీవితం చాలా సంతోషంగా ఉంది” అని ఆమె కామెంట్ చేశారు. కాబట్టి మీరు ఎన్ని అనుకున్నా… నేను ఇంతే, మారానని అనసూయ చెప్పకనే చెప్పింది. అనసూయకు భర్త నుండి ఫుల్ సపోర్ట్ ఉంది. గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే ఇవన్నీ తప్పదని ఆయనకు తెలుసు. అందుకే ఇద్దరు కొడుకు ఉన్నప్పటికి అనసూయ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.
నటిగా అనసూయ కెరీర్ స్వింగ్ లో ఉంది. ఆమెకు కీలక పాత్రలు దక్కుతున్నాయి. గత ఏడాది అనసూయ రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం వంటి చిత్రాల్లో నటించారు. నెక్స్ట్ పుష్ప 2లో దాక్షాయణిగా డీ గ్లామర్ లేడీ విలన్ రోల్ లో మెప్పించనుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న విడుదల కానుంది.