Anasuya Bharadwaj: ఆడవాళ్లు తలుచుకుంటే యుద్ధాలు జరుగుతాయి, రాజ్యాలు మారుతాయి, తలలు తెగుతాయి… చరిత్రలో ఏ గొప్ప యుద్ధం తీసుకున్న దానికి ప్రధాన కారణం అమ్మాయిలే అయి ఉంటారు. కింగ్ లాంటి మగాడిని సైతం వాళ్ళ అందం తో కొంగున చుట్టేసుకునే శక్తి ఒక మగువ కే ఉంది… ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ల అందానికి ముగ్ధుడు కానీ మగాడు ఉండడు… వాళ్ల అంద చందాలతో హొయలు కురిపిస్తూ కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదిక గా వాళ్ళ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటారు. జబర్దస్త్ షో యాంకర్ గా అనసూయ మంచి పాపులారిటిని సంపాదించుకుంది. ఇక దాని ద్వారా వచ్చిన క్రేజ్ తో ఆమె పలు సినిమాల్లో కీలకమైన పాత్రల్లో నటించి నటిగా గొప్ప గుర్తింపును తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు అనసూయ తన అందానికి ప్రాధాన్యం ఇస్తూ దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫొటోలు దిగింది.
‘తన సొగసు కి సోయగాన్ని అద్ది, ఆస్వాదించే మనస్సుకు వయస్సు తో పని లేదని, చూసే కండ్లకు ఆనందపడే గుణం ఉంటే సరిపోతుందని’ ఆ ఫోటోల ద్వారా తన అభిమానులకు చెప్పకనే చెబుతూ వాళ్ళు ఆనందపడేలా చేస్తోంది… అనసూయ అంటే సగటు ఆడవాళ్ళకు అసూయ పుట్టేలా వ్యవహరిస్తోంది…
తను సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఎంజాయ్ మెంట్ విషయంలో మాత్రం తను ఎక్కడ తగ్గదు. వారానికి ఒకసారి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నట్టుగా కొన్ని ఫోటోలను, వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది… అలాగే తన ఏజ్ పెరగడం లేదు రోజు రోజుకి తగ్గుతుందని గుర్తు చేస్తూ, సినిమాల్లో తన కోసం స్పెషల్ క్యారెక్టర్లు రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకొండని ఎలాంటి పాత్రనైన చేయడానికి తను సిద్ధమని ఫోటోల ద్వారా ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తోంది…
‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా అదరగొట్టింది. ‘పుష్ప’ సినిమాలో కాత్యాయనిగా విలనిజాన్ని పండించింది. పాత్ర ఏదైనా తన ఔన్నత్యాన్ని చాటుకునేలా పర్ఫామెన్స్ ఉంటుందని తను చాలా సందర్భాల్లో చెప్పడమే కాకుండా చేసి చూపించింది. అందుకే అనసూయ కోసం డిఫరెంట్ క్యారెక్టర్లను డిజైన్ చేయాలని కొత్తగా వచ్చిన దర్శకులు సైతం ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…