Pushpa 2: ‘పుష్ప’ తెలుగులో పెద్దగా విజయం సాధించలేదు, కానీ.. హిందీ మార్కెట్ లో మాత్రం మంచి విజయం సాధించిందనే అనుకోవాలి. గతంలో బన్నీకి హిందీ మార్కెట్ లేదు. కానీ పుష్పకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొత్తమ్మీద హిందీ మార్కెట్ పై పట్టు సాధించాలనే ఉద్దేశ్యంతోనే అల్లు అర్జున్ ఈ సినిమా చేశాడు. తాను అనుకున్నది పుష్పతో నెరవేరింది. అందుకే.. బన్నీ తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు.

కాకపోతే, ఆంధ్రాలో పుష్పకు నష్టాలు వచ్చాయి. అయినా తాను కోరుకున్నట్లు హిందీలో హిట్ అయింది, అందుకే బన్నీ ఉత్సాహంగా సుకుమార్ ను ఇంకా ప్రేమిస్తున్నాడు. సుక్కు లేకపోతే తాను లేను అనే స్థాయిలో స్టేట్ మెంట్స్ ఇస్తున్నాడు. అందుకే సుక్కు కూడా పుష్ప రెండో పార్టు ఆలస్యం చేయకుండా వెంటనే స్పీడ్ పెంచాడు. పుష్ప 2 షూటింగ్ కోసం టీమ్ మెంబర్స్ ను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాడు.
ఇప్పటికే దర్శకుడు సుకుమార్ అందరితో సమాయత్తమవుతున్నాడు. సంక్రాంతి పండుగ అయిపోగానే స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయాలని కూడా ఫిక్స్ అయ్యాడు. అయితే, సుక్కు చేయబోతున్న మార్పులు కారణంగా పుష్ప 2’లో మరో హీరోయిన్ కి స్కోప్ ఉందని తెలుస్తోంది. మొదటి భాగంలో హీరో బన్నీకి రష్మికతో పెళ్లి కూడా పెట్టారు. పైగా ఫస్ట్ పార్ట్ పెళ్లి సీన్ తో ఎండ్ చేశారు.
పెళ్లి అయితే, ఇక రొమాన్స్ కి స్కోప్ ఏమి ఉంటుంది. అందుకే.. పుష్ప రెండో భాగంలో ‘రొమాన్స్’కి స్కోప్ పెంచడం కోసం ఇప్పుడు మరో హీరోయిన్ ను తీసుకోబోతున్నారు. మాస్ మసాలా అంశాలు పెట్టాలి అంటే.. మంచి గ్లామరస్ హీరోయిన్ కావాలి. అందుకే.. సుకుమార్ అలాంటి హీరోయిన్ కోసం కసరత్తులు చేస్తున్నాడు. పైగా రెండో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.
Also Read: Ashu Reddy: అషురెడ్డికి షాకిచ్చిన అసిస్టెంట్.. ఫొటోల బండారం బట్టబయలు..!
ఇక ‘పుష్ప- ది రైజ్’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. అయితే, ప్రేక్షకులను మెప్పించే కోణంలో మొదట్లో బాగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. సినిమా ప్లాప్ అని బాగా టాక్ వినిపించింది. అయితే, అనూహ్యంగా ఆ తర్వాత పుష్ప బాగా పుంజుకుంది. బాక్సాఫీసు వద్ద పుష్ప సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
Also Read: Pasupuleti Kannamba: సినిమాల వల్ల ఆమె కాదు, ఆమె వల్ల సినిమాలే బాగుపడ్డాయి