Ananya Nagalla: పవన్ కళ్యాణ్ మూవీ హీరోయిన్.. వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ళ తన పెళ్లి వార్తలపై స్పందించారు. తనకు అబ్బాయిని సెలెక్ట్ చేసి పెట్టినందుకు కృతజ్ఞతలు అన్నారు. అనన్య నాగళ్ళ సంచలన ట్వీట్ వైరల్ గా మారింది. రెండు రోజులుగా మీడియాలో అనన్య నాగళ్ళ పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ కి చెందిన టాప్ ప్రొడ్యూసర్ చిన్న కుమారుడితో అనన్య ప్రేమాయణం నడుపుతున్నారని. అతనితో పీకల్లోతు ప్రేమలో ఉన్న అనన్య పెళ్ళికి సిద్ధమయ్యారని. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించిన ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారంటూ వరుస కథనాలు వెలువడ్డాయి.

ప్రేమ, పెళ్లి వార్తల నేపథ్యంలో అనన్య నాగళ్ళ స్పందించారు. ఆమె ట్విట్టర్ వేదికగా ఒక క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో రూమర్స్ పై సెటైర్ వేశారు. నాకు పెళ్ళికొడుకుని చూసి పెట్టినందుకు ధన్యవాదాలు. ఆ అబ్బాయి ఎవరో? పెళ్లి ఎప్పుడో? ఏ టైంలోనో? నాకు కూడా చెప్పండి. ఎందుకంటే నా పెళ్ళికి నేను హాజరుకావాలి కదా… అంటూ ట్వీట్ చేసింది. నేను ప్రేమించి అబ్బాయి ఎవరో నాకే తెలియదని పరోక్షంగా చెప్పిన అనన్య, పెళ్లి వార్తలను ఖండించారు. ప్రచారం అవుతున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చిపారేశారు.
దీంతో అనన్య నాగళ్ళ పెళ్లి వార్తలకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. అనన్య నాగళ్ళ అలా ట్వీట్ చేసినంత మాత్రాన నమ్మలేమని, నిజం నిలకడ మీద తెలుస్తుందని మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మల్లేశం మూవీతో అనన్య వెండితెరకు పరిచయమయ్యారు. చింతకింది మల్లేశం బయోపిక్ గా తెరకెక్కిన ఆ చిత్రంలో ప్రియదర్శి భార్య పాత్ర చేశారు. క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్న మల్లేశం కమర్షియల్ గా నిరాశపరిచింది.

వకీల్ సాబ్ మూవీలో అనన్యకు ఆఫర్ రావడం అనూహ్య పరిణామం. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా తెరకెక్కిన వకీల్ సాబ్ లో ముగ్గురు అమ్మాయిలో ఒకరైన కీలక రోల్ చేశారు. అంజలి, నివేదా థామస్ లతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వకీల్ సాబ్ అనన్యకు ఫేమ్ తెచ్చిపెట్టింది. అలాగే మ్యాస్ట్రో మూవీలో నటుడు నరేష్ కూతురు పాత్ర చేశారు. ప్రస్తుతం అనన్య పాన్ ఇండియా చిత్రం శాకుంతలం చేస్తున్నారు. దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా ఆ చిత్రం తెరకెక్కుతుంది. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో తన గ్లామర్ పవర్ చూపిస్తుంది ఈ తెలుగు బ్యూటీ.
