https://oktelugu.com/

అనన్య.. ఎక్స్ పోజింగ్ కాదు, నటన పై ఫోకస్ పెట్టు !

‘అనన్య నాగళ్ళ’ అని మన తెలుగు అమ్మాయే. చక్కగా నటిస్తోంది, మంచి నటి అంటూ ఆమెకు మంచి పేరు వచ్చింది. అయితే, ఎప్పుడైతే ‘వకీల్ సాబ్’ సినిమాలో ఆమెకు గుర్తింపు వచ్చిందో.. ఇక అప్పటి నుండి అనన్య డ్రెసింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. తనకు హీరోయిన్ గా ఒక ఇమేజ్ వచ్చిందని.. కాబట్టి హీరోయిన్ అన్నాక, ఎక్స్ పోజింగ్ చేయాలని అనన్య ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తోంది. అవసరం ఉన్నా లేకున్నా హాట్ ఫోటో షూట్ లు చేయడానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : May 11, 2021 / 01:29 PM IST
    Follow us on

    ‘అనన్య నాగళ్ళ’ అని మన తెలుగు అమ్మాయే. చక్కగా నటిస్తోంది, మంచి నటి అంటూ ఆమెకు మంచి పేరు వచ్చింది. అయితే, ఎప్పుడైతే ‘వకీల్ సాబ్’ సినిమాలో ఆమెకు గుర్తింపు వచ్చిందో.. ఇక అప్పటి నుండి అనన్య డ్రెసింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. తనకు హీరోయిన్ గా ఒక ఇమేజ్ వచ్చిందని.. కాబట్టి హీరోయిన్ అన్నాక, ఎక్స్ పోజింగ్ చేయాలని అనన్య ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తోంది.

    అవసరం ఉన్నా లేకున్నా హాట్ ఫోటో షూట్ లు చేయడానికి తెగ ఉత్సాహ పడుతుంది. మరి ఈ బ్యూటీ మైండ్ సెట్ మొదటి నుండి ఇలానే ఉంటుందో.. లేక వచ్చిన గుర్తింపుతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఏమి చేస్తోందో తెలియకుండా ఎక్స్ పోజింగ్ చేసేస్తూ.. మొత్తానికి అనన్య కమర్షియల్ హీరోయిన్ లా తన పద్దతిని మార్చుకుంటూ పోతుంది.

    అసలు ‘మల్లేశం’ సినిమాలో అనన్యను చూసినప్పుడు, అచ్చ తెలుగు బ్యూటీగా అనన్యకి గుడ్ నేమ్ వచ్చింది. ఆ సినిమాలో ఆమె నటన చూసిన దిల్ రాజు, ఆమెకు ‘వకీల్ సాబ్’లో అమాయక ఆదిలాబాద్ యువతిగా అవకాశం ఇచ్చి, ఆమెను నిలబెట్టడానికి బాగానే ప్రయత్నం చేశాడు. అందుకు తగ్గట్టుగానే అనన్య కూడా చక్కగా మరింతగా పాపులర్ అయింది.

    ప్రస్తుతం అనన్యకి హీరోయిన్ గా చాలా ఆఫర్లు వస్తున్నాయి. మంచిదే కానీ హీరోయిన్ అన్నాక కమర్షియల్ లుక్స్ లో కనిపిస్తూ ఎక్స్ పోజింగే చేయాల్సిన అవసరం లేదు. అయినా ఆమెలో హాట్ నెస్ కూడా తక్కువే. అలాంటప్పుడు ఎందుకు పరిధులు దాటి గ్లామర్ గా కనిపించాలి ? ఏ.. సాయి పల్లవిలా నటన పై ఫోకస్ పెట్టి మంచి పాత్రల్లో నటించొచ్చు కదా. అనన్య ఇకనైనా మారితే ఆమెకే మంచింది.