Anaganaga Oka Raju First Review: నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది… నవీన్ పోలిశెట్టి ‘జాతి రత్నాలు’ సినిమాతో హీరోగా నిలదొక్కుకున్నప్పటికి ఆయన ఆచితూచి మరి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తన తోటి హీరోలందరు వరుస పెట్టి సినిమాలను చేస్తుంటే ఆయన మాత్రం సంవత్సరానికి ఒక సినిమాను చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే ‘అనగనగా ఒక రాజు’ సినిమా ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసింది. రీసెంట్ గా ఈ సినిమాని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకి వేసి చూపించారు. దాన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని మూటగట్టుకోబోతోంది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కోనసీమ ప్రాంతంలోని రాజుల కుటుంబానికి చెందిన నవీన్ పోలిశెట్టి తనకున్న కొన్ని అలవాట్ల వల్ల తను ఎలా ఇబ్బంది పడ్డాడు. అలాగే తను ప్రేమించిన అమ్మాయి తన నుంచి దూరమైపోతే ఆమెను ఎలా తిరిగి మళ్లీ సంపాదించుకున్నాడు అనే కథతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఆమెను మళ్లీ తిరిగి ఎలా సంపాదించుకున్నాడు అనే కథతో ఈ సినిమా తెరకెక్కింది…
ఇక మొదటి నుంచి చివరి వరకు కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించారట. ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ సినిమాలో చాలా ఎక్కువగా ఉన్నాయంటూ సినిమాను చూసిన సినిమా పెద్దలు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
జాతి రత్నాలు తర్వాత నవీన్ పోలిశెట్టి అంతటి కామెడీ టైమింగ్ తో నటించిన సినిమా కూడా ఇదే అంటూ సినిమా పెద్దలు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం… ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయట. ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్రేక్షకులకు ఒక హై మూమెంట్ ను ఇస్తుందట… ఇక సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు సైతం ప్రేక్షకులను అలరిస్తాయని ఈ సినిమాని చూసిన వాళ్ళు చెబుతుండడం విశేషం…
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందట…మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా వరకు ప్లస్ అవుతుందని వాళ్ళు చెబుతుండటం విశేషం…ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా ఆదరిస్తారు అనేది తెలియాల్సి ఉంది…