Anaganaga Oka Raju Box Office Collection: సంక్రాంతి సంబరం ముగిసింది. ఈ పండుగ దినాల్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన 5 సినిమాల్లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ మినహా, మిగిలిన సినిమాలన్నీ బాగా డౌన్ అయిపోయాయి. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) గురించి మాట్లాడుకోవాలి. కచ్చితంగా ఈ చిత్రం సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత కూడా మంచి రన్ ని సొంతం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ నిన్న (6వ రోజు) 50 శాతం కి పైగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. 5వ రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 4 కోట్ల 37 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ఆరవ రోజున కేవలం కోటి 83 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే నమోదు అయ్యాయి. దీనిని ట్రేడ్ భారీ డ్రాప్స్ గానే పరిగణిస్తోంది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఆరు రోజులకు కలిపి 27 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం నుండి 9 కోట్ల 54 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, సీడెడ్ ప్రాంతం నుండి 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 5 కోట్ల 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, తూర్పు గోదావరి జిల్లా నుండి 3 కోట్ల 14 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 1 కోటి 77 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 2 కోట్లు, కృష్ణా జిల్లా నుండి 1 కోటి 65 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి కోటి 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 27 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు కేవలం తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. ఇక గ్రాస్ దాదాపుగా 46 కోట్ల రూపాయిల వరకు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిందట.
మరో రెండు రోజుల్లో ఇది 50 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోనుంది. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, ఓవర్సీస్ నుండి ఏకంగా 7 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 37 కోట్ల 59 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి., గ్రాస్ వసూళ్లు దాదాపుగా 68 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే, ఈ సినిమా క్లోజింగ్ వసూళ్లు 45 నుండి 50 కోట్ల షేర్ వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
