Anaganaga Oka Raju 3 Days Collections: నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) మరోసారి కుంభస్థలం బద్దలు కొట్టేసాడు. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని, బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు నాల్గవ బ్లాక్ బస్టర్ ని అతి తేలికగా అందుకున్నాడు. ఇప్పటి వరకు హిట్ అయినటువంటి ప్రతీ నవీన్ మూవీ, అతని సొంత టాలెంట్ తో, కామెడీ టైమింగ్ తో హిట్ అయ్యినవే. ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) సినిమాలో కూడా పెద్దగా కంటెంట్ ఏమి లేకపోయినప్పటికీ, నవీన్ పోలిశెట్టి తన పంచులు, కామెడీ టైమింగ్, ఎమోషన్స్ తో సూపర్ హిట్ చేసేసాడు. 28 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఈ సినిమా మొదటి రోజుల్లో ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో వివరాలు చూస్తే మెంటలెక్కిపోవాల్సిందే.
ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మూడవ రోజున 5 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. అలా తెలుగు రాష్ట్రాల్లో మొదటి మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి 15 కోట్ల 88 లక్షలు, 26 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ప్రాంతాల వారీగా చూస్తే నైజాం ప్రాంతం నుండి 5 కోట్ల 66 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, సీడెడ్ ప్రాంతం నుండి కోటి 88 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 2 కోట్ల 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఈస్ట్ గోదావరి జిల్లా నుండి కోటి 71 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లా నుండి కోటి 11 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక గుంటూరు జిల్లా నుండి కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కృష్ణా జిల్లా నుండి 93 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 67 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి 4 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 21 కోట్ల 28 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 38 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం రాబట్టింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇక కేవలం 6 కోట్ల 72 లక్షలు మాత్రమే రాబట్టాలి. నేటి తో ఆ మార్కుని అందుకొని క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ లోకి ఈ చిత్రం అడుగుపెట్టబోతుంది. ఇక రేపటి నుండి వచ్చే ప్రతీ పైసా లాభమే.