Prabhas And Maruthi: సలార్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న ప్రభాస్ కి రీసెంట్ టైంలో ఈ సినిమాను మించిన హిట్ సినిమా రాలేదనే చెప్పాలి. డిసెంబర్ నెలలోనే రణ్బీర్ కపూర్ అనిమల్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకొని 900 కోట్ల వరకు కలక్షన్స్ ని రబట్టగా ప్రభాస్ ఇప్పటికే వన్ వీక్ లోనే 600క కోట్లకు పైన కలక్షన్స్ ని రాబట్టారు. ఇక ఈ లెక్కన ఈ సినిమా లాంగ్ రన్ లో 1000 కోట కలక్షన్ల ను ఈ సినిమా ఈజీగా సాధిస్తుంది అంటూ ట్రేడ్ పండితులు వాళ్ళ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి సలార్ సినిమా సూపర్ సక్సెస్ అవడం వెనక ప్రశాంత్ నీల్ కృషి చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన టైప్ ఆఫ్ మేకింగ్ తోనే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం ప్రశాంత్ నీల్ కే వెళుతుంది అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ నెక్స్ట్ సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మారుతి డైరెక్షన్ లో చేస్తున్న ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కి సంబంధించిన అప్డేట్ అనేది ఈ రెండు రోజుల్లో బయటికి రానున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.
ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన షూట్ ఎప్పుడో స్టార్ట్ అయినప్పటికీ ఇంతవరకు ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ గాని, ఫస్ట్ లుక్ గాని ఏది కూడా బయటికి రాకపోవడంతో అసలు ఈ సినిమా షూటింగ్ నడుస్తుందా లేదంటే ఆపేసారా లాంటి అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి. కాబట్టి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే 50% కంటే ఎక్కువ పూర్తవడంతో ఈ సినిమా కి సంభందించిన ఫస్ట్ లుక్ ని గాని, గ్లిమ్స్ ని గానీ ఈ రెండు రోజుల్లో రిలీజ్ చేసి సినిమా మీద హైప్ పెంచడానికి ప్రొడ్యూసర్లు డైరెక్టర్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది…
మరి కొంతమంది మాత్రం మారుతీతో ప్రభాస్ ఎందుకు సినిమా చేస్తున్నాడు అంటు వాళ్ల అభిప్రాయాన్ని ఇంతకుముందు చాలాసార్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు కానీ ఒకసారి గ్లిమ్స్ గాని ఫస్ట్ లుక్ చూసిన తర్వాత అందరికీ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతాయి అంటూ చిత్ర యూనిట్ తెలియజేస్తుంది. చూడాలి మరి భారీ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్న ప్రభాస్ కి మారుతి సినిమా ఏ ఎఫెక్ట్ ని ఇస్తుందో…