Mahesh Rajamouli Movie: లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తానని రజినీకాంత్ చెప్పినట్లు… రాజమౌళి వర్క్ పరంగా చాలా స్లో. ప్రతి విషయంలో పర్ఫెక్షన్ కురుకునే జక్కన్నతో సినిమా అంటే మినిమమ్ నాలుగైదేళ్ళ కేటాయించాలి. బాహుబలి సిరీస్ కి ఐదేళ్లు సమయం తీసుకున్న రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ మూవీ నాలుగేళ్లు తెరకెక్కించాడు. ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ ఫేమ్ రాబట్టిన ఈ దర్శకధీరుడు మహేష్ మూవీ హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఏడాది కాలంగా ఈ స్క్రిప్ట్ పనిమీదే ఉన్నాడు.
లాక్ డౌన్ సమయంలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ పడింది. అప్పుడు ఖాళీగా ఇంట్లో ఉన్న రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తో కథ చర్చలు జరిపారు. కొన్ని స్టోరీ లైన్స్ నుండి జంగిల్ అడ్వెంచర్ డ్రామా ఎంచుకున్నారు. మహేష్ ఇమేజ్ కి సరిపోవడంతో పాటు యూనివర్సల్ సబ్జెక్టు గా ఉంటుందని ఆ పాయింట్ ఎంచుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ విడుదల అనంతరం కొన్నాళ్ళు ఆస్కార్ ప్రమోషన్స్ లో గడిపాడు రాజమౌళి.
ఆస్కార్ వేడుక ముగిసిన తర్వాత పూర్తిగా మహేష్ మూవీపై దృష్టి పెట్టాడు. తాజా సమాచారం రాజమౌళి-విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ లాక్ చేశారట. ఫైనల్ స్క్రిప్ట్ ప్రిపరేషన్ అయిపోయిందట. స్క్రిప్ట్ కూడా అదిరిపోయేలా కుదిరిందట. త్వరలో పూర్తి స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళుతుందట. ఈ మేరకు టాలీవుడ్ నుండి విశ్వసనీయ సమాచారం అందుతుంది.
మహేష్ ఈ మూవీలో ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా కనిపిస్తాడట. ఇండియానా జోన్స్ మాదిరి ఉంటుందట. రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. దాదాపు రూ. 800 కోట్లు కేటాయించనున్నారట. ఇక హాలీవుడ్ టెక్నీషియన్స్, యాక్టర్స్ భాగం కానున్నారట. ఇక మహేష్ తరచుగా జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. రాజమౌళి సినిమాలో లుక్ కోసమే ఆయన కష్టపడుతున్నారని ప్రచారం జరుగుతుంది. తన సినిమాల్లో హీరోలను కండలతో ప్రజెంట్ చేయడం రాజమౌళికి ఇష్టం. మరి మహేష్ సరికొత్త లుక్ ఎలా ఉంటుందో చూడాలి…