Ameesha Patel: అమీషా పటేల్ కెరీర్ గ్రాండ్ గా మొదలైంది. ఆమె డెబ్యూ మూవీ కహోనా ప్యార్ హై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. హృతిక్ రోషన్ హీరోగా నటించాడు. రెండో మూవీ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ సూపర్ హిట్. అమీషా పటేల్ గ్లామర్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మూడో చిత్రం గదర్. బాబీ డియోల్ హీరోగా నటించిన గదర్ ఎంత పెద్ద సంచలనమో తెలిసిందే. అలా హ్యాట్రిక్ విజయాలతో చిత్ర పరిశ్రమలో పాగా వేసింది.
బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ నేపథ్యంలో అమీషా పటేల్ తెలుగులో తక్కువ చిత్రాలు చేశారు. బద్రి అనంతరం అమీషా పటేల్ నటించిన తెలుగు చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. మహేష్ తో చేసిన నాని, ఎన్టీఆర్ తో జతకట్టిన నరసింహుడు దారుణ పరాజయం చూశాయి. బాలకృష్ణ నటించిన పరమవీరచక్ర మూవీలో సైతం నటించింది. ఇది డబుల్ డిజాస్టర్. ఆ దెబ్బతో మరలా ఆమెకు తెలుగులో ఆఫర్స్ రాలేదు.
2018 తర్వాత పూర్తిగా సిల్వర్ స్క్రీన్ కి దూరమైంది. ఐదేళ్ల తర్వాత కమ్ బ్యాక్ గ్రాండ్ గా ఇచ్చింది. గదర్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన గదర్ 2 ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. బాబీ డియోల్-అమీషా పటేల్ మరోసారి జతకట్టారు. గత ఏడాది విడుదలైన గదర్ 2 వందల కోట్ల వసూళ్లు రాబట్టింది. ఫేడ్ అవుట్ స్టార్స్ నటించిన ఆ చిత్రం ఊహించని వసూళ్లు రాబట్టింది. గదర్ 2 అనంతరం మిస్టరీ ఆఫ్ ది టాటూ టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది.
ఈ ఏడాది ఆరంభంలో టూబా తేరా జెల్వా అనే మూవీతో ప్రేక్షకులను అలరించింది. అడపాదడపా చిత్రాలు చేస్తున్న అమీషా పటేల్ మోడలింగ్ లో రాణిస్తుంది. సోషల్ మీడియాలో అమీషా పటేల్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. దారుణమైన స్కిన్ షోకి ఆమె తెరలేపుతుంది. తాజాగా లో దుస్తుల్లో ఎద అందాలు చూపిస్తూ టెంపరేచర్ పెంచేసింది. అమీషా పటేల్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతుండగా నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram