Homeఎంటర్టైన్మెంట్Ambati Arjun: వైల్డ్ కార్డు ఎంట్రీ తో…బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ కాబోతున్న సునామీ…..

Ambati Arjun: వైల్డ్ కార్డు ఎంట్రీ తో…బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ కాబోతున్న సునామీ…..

Ambati Arjun: ఎప్పటికప్పుడు కొత్త క్లిష్టలతో దూసుకుపోతున్న బిగ్ బాస్ ప్రతి సీజన్ కు ఏదో ఒక సర్ప్రైజ్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఏడేళ్ల నుంచి తెలుగు బుల్లితెరపై సాటిలేని రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. మంచి టిఆర్పి కూడా రావడంతో నిర్వాహకులు మరిన్ని ప్రయోగాలు చేసి ఎప్పటికప్పుడు కొత్త సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 లో భాగంగా హౌస్ లో రోజుకొక రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీని మరింత పెంచడం కోసం త్వరలో ఓ కొత్త కంటెస్టెంట్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

కొత్త కంటెస్టెంట్ అంటే ఆషామాషీగా అనుకునేరు.. అతని ఎంట్రీ ప్రస్తుతం హౌస్ లో సేఫ్ గా సెటిల్ అయిన కంటెస్టెంట్స్ కు సునామీయే మరి. ప్రస్తుతం పవర్ అస్త్ర సాధించే నేపథ్యంలో జరుగుతున్న టాస్కులలో మెల్లిగా ఒకరి తర్వాత ఒకరు తమ అసలు ఉద్దేశం బయట పెడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో రతిక పాప సృష్టించిన రచ్చ భలే రంజుగా ఉంది. మరోపక్క పల్లవి ప్రశాంత్ తన పులిహోర తనది అన్నట్టు కలుపుతూనే ఉన్నాడు.

నిజానికి బిగ్ బాస్ సీజన్ 7 లో 20 మందికి పైగా కంటెస్టెంట్స్ ఉండాల్సి ఉంది. అయితే ప్రీమియం ఎపిసోడ్‌లో కేవలం 14 మందిని మాత్రమే ఇంట్రడ్యూస్ చేసి ఇంటి లోపలికి పంపించారు. అందులో ఆల్రెడీ మొదటివారం ఒకరు ఎలిమినేట్ కాదా మిగిలిన 13 మందిలో ఈ వారం మరొకరు ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే 14 మందితో షో ఏంటి అని కన్ఫ్యూజ్ అయిన వారికి కొత్తగా మరొక క్లారిటీ అందివ్వబోతుంది బిగ్ బాస్ టీమ్.

ఈ సీజన్ కాన్సెప్ట్ ఉల్టా పుల్టా కావడంతో.. పేరుకు తగినట్టు అన్ని అలాగే జరుగుతున్నాయి. ఇక హౌస్ లోకి పంపకుండా మిగిల్చిన కంటెంట్ ను ఒకరినొకరిగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మధ్య మధ్యలో హౌస్ లోకి సర్ప్రైజ్ గిఫ్ట్ కింద పంపిస్తారు అని తెలుస్తుంది. ప్రస్తుతం బిగ్బాస్ లో మొదటి వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరో తెలుసా?…ప్రముఖ సీరియల్స్ సెలబ్రిటీ..అంబటి అర్జున్ .. ఈవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవుతున్నట్లు తెలుస్తోంది.

అర్జున్ ఎంట్రీ ఇప్పటికే హౌస్ లో బాగా సెటిల్ అయినా మా బ్యాచ్ కు కంగారు పుట్టించే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇప్పటికే హౌస్ లో వచ్చినప్పటి నుంచి ఒకే గూటి గువ్వల్లా.. ఎప్పుడు ఒకే దగ్గర ఉండే అమర్‌దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్‌లు స్టార్ మా బ్యాచ్ అని బిరుదును పొందారు. అయితే వీళ్ళు కావాలని మైండ్ గేమ్ ఆడుతూ ఒకటిగా కలిసి తిరుగుతున్నారు…అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బ్యాచ్ కి కాస్త టెన్షన్ పుట్టించడం కోసం అర్జున్ ని రంగంలోకి దింపుతున్నారు. అయితే బిగ్ బాస్ సెట్ చేసిన పద్మవ్యూహంలో అర్జున్ .. అభిమన్యుడిలా అర్థజ్ఞానంతో వెనక్కి తిరుగుతాడా…లేక నిజంగా అర్జునుడిగా వ్యూహాన్ని చేదిస్తాడా…రాబోయే ఆటలో చూడాలి మరి.

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
Exit mobile version