AMB Cinemas: హైదరాబాద్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా కలిసి నిర్మించిన AMB సినిమాస్ కి ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ ఏర్పడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ మల్టీ ప్లెక్స్ లోకి అడుగు పెడితే చాలు, ఒక కొత్త ప్రపంచం లోకి అడుగుపెట్టినట్టే ఉంటుంది. లావిష్ గా ఫారిన్ థియేటర్స్ ఎలా ఉంటాయో, అచ్చు గుద్దినట్టు అలాగే ఉంటుంది ఈ మల్టీ ప్లెక్స్. ఇక ఈ థియేటర్స్ లో సౌండ్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా, ఈ థియేటర్ లో విడుదలైన ప్రతీ సినిమాకు మినిమం గ్యారంటీ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి. అందుకు ముఖ్య కారణం నిస్సందేహంగా ఈ థియేటర్ గొప్పతనమే. హైదరాబాద్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రీసెంట్ గానే బెంగళూరు లో కూడా AMB సినిమాస్ ని ప్రారంభించారు.
సౌత్ ఇండియా లో ఎక్కడా లేని విధంగా ‘డాళ్బీ స్క్రీన్స్’ ని ఈ మల్టీప్లెక్స్ లో మనం చూడొచ్చు. మహేష్ బాబు స్వయంగా వచ్చి ఈ మల్టీప్లెక్స్ ని ఓపెన్ చేసి వెళ్ళాడు. ఈ థియేటర్స్ లో సినిమాలను చూసిన ప్రతీ ఒక్కరు అద్భుతమైన అనుభూతి కలిగింది అంటూ కామెంట్స్ చేయడం తో, రోజురోజుకి ఈ థియేటర్స్ ని వీక్షించే జనాల సంఖ్య బాగా పెరిగింది. అతి తక్కువ సమయం లో ఎక్కువ క్రేజ్ రావడంతో ప్రేక్షకులకు కృతజ్ఞతగా నేడు మార్నింగ్ షోస్ కి వచ్చిన ప్రతీ ప్రేక్షకుడికి ఉచితంగా థియేటర్ స్టాఫ్ సమోసాలు అందించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఇప్పటి వరకు ఏ మల్టీప్లెక్స్ స్టాఫ్ కూడా చేయలేదు. దీనిని బట్టీ మహేష్ బాబు కి ఆడియన్స్ ఎంత ప్రేమనే అర్థం చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా లో చెప్పుకొస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే రాజమౌళి తో ఆయన చేస్తున్న ‘వారణాసి’ మూవీ షూటింగ్ గ్యాప్ లేకుండా సాగుతోంది. రాజమౌళి కెరీర్ లోనే అత్యంత వేగంగా పూర్తి అవ్వబోతున్న సినిమా ఇది. ఈ ఏడాది సెప్టెంబర్ లోపు మహేష్ బాబు కి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అవ్వబోతుంది. VFX వర్క్ కూడా చకచకా పూర్తి అవుతున్నాయి. వర్క్ ఆన్ టైం లో పూర్తి అవుతుండడంతో నేడు రాజమౌళి అధికారికంగా విడుదల తేదీని కూడా ప్రకటించేశాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల కానుంది. టాలీవుడ్ నుండి రాబోతున్న మొట్టమొదటి ఇంటర్నేషనల్ సినిమా ఇది. ఏ రేంజ్ వసూళ్లను రాబడుతుందో చూడాలి.