Amardeep Chaudhary Vs Pallavi Prashanth: బిగ్ బాస్ హౌస్ లో నిన్న ప్రతి సంఘటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రెండవ వారం నామినేషన్స్ మునుపెన్నడూ ఎరుగనంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. మరీ ముఖ్యంగా అమరదీప్ చౌదరి నిన్న ఎపిసోడ్లో తన విశ్వరూపం చూపించాడు. రైతు బిడ్డని, కామన్ మ్యాన్ ని అని చెప్పుకుంటూ..ఇటు ఇంట్లో …అటు ఆడియన్స్ ముందు సింపతి యాంగిల్ గ్రైండ్ చేయడానికి ప్రయత్నిస్తున్న పల్లవి ప్రశాంత పై విరుచుకుపడ్డాడు.
తొలి వారం జరిగిన నామినేషన్ లో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. రెండవ వారం నామినేషన్ లో భాగంగా నిన్నటి ఎపిసోడ్లో ఎక్కువగా టార్గెట్ అయిన వాళ్ళు శివాజీ, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ. అయితే ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డల గురించి సెంటిమెంట్ డైలాగులు వేస్తుండడం పై అమర్దీప్ మండిపడ్డాడు.
రైతుబిడ్డ అంటూ సింపతీగా హౌస్ లో అడుగు పెట్టడం కాదు…నీ రియాల్టీ ఏమిటో జనాలకి చూపించు ఇలా డబల్ సైడ్ గేమ్స్ ఆడొద్దు…అని నిలదీశాడు.గౌతమ్, ప్రియాంకర్ జైన్, సింగర్ దామిని, షకీలా కూడ పల్లవి ప్రశాంత్ ద్వంద్వ వైఖరి పై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు అతని నామినేట్ కూడా చేశారు. గౌతమ్ తన నామినేషన్ లో భాగంగా కారణం వివరిస్తూ ప్రశాంత్ కనిపిస్తున్నంత కామన్ మ్యాన్ ఏమి కాదు అని కచ్చితంగా తేల్చి చెప్పాడు.
షకీలా అయితే ఏకంగా నాయనా ప్రశాంతు…ఎక్కడున్నావు నాకు కనిపించడం లేదు.. కానీ బిగ్ బాస్ ఈ విషయం అతనికి అర్థం అయ్యేలా చెప్పే శక్తి కూడా నా దగ్గర లేదు కాబట్టి రీజన్ మీకే చెప్తున్నాను… అనడం ప్రశాంత్ ఏ రేంజ్ లో నసపెడతాడు చెప్పకనే చెప్పింది. ఇక దామిని అయితే…నాకు ఎంతమంది తోబుట్టువులు ఉన్నారో చెప్పరా ?అని నిలదీసింది. దానికి ప్రశాంత్ నాకెలా తెలుస్తుంది అక్కా అని అమాయకంగా అడిగాడు. అదే నేను చెబుతున్న ఇక్కడ ఎవరి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు కానీ నీ గురించి మాత్రం అందరికీ తెలుసు…ఎందుకంటే నువ్వు నీ గురించే మాట్లాడుతావ్.. కెమెరాల కోసం ,బిగ్ బాస్ కోసం, బయట ఉన్న జనాల కోసం సింపతి కోసం మాట్లాడుతావు…అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటూ తేల్చి చెప్పింది.
అందరూ అన్ని చెబుతున్నారు తన ధోరణి తనదే అన్నట్లుగా పదేపదే రైతుకి ఇస్తా …రైతుకు సహాయం చేస్తా.. అని డైలాగులు కొడుతున్న పల్లవి ప్రశాంత్ వైఖరి అమర్దీప్ కు చిరాకు తెప్పించడంతో..ఓ లక్ష ఇస్తే.. రైతుకి ఇస్తానంటున్నావ్ కానీ.. వాళ్ల ప్లేస్‌లో ఓ రిక్షా డ్రైవర్.. లారీ డ్రైవర్ ఉంటాడు.. అసలు రైతు అనే సెంటిమెంట్ డైలాగ్ పెట్టుకుని మాట్లాడుతున్నవే తప్ప నీకు మిగిలిన వాళ్ళ బాధ తెలుసా అని ఆవేశంగా అడిగాడు. ఈ వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో పల్లవి ప్రశాంత్ పుష్పలో అల్లు అర్జున్ టైపులో భుజం ఎత్తి నిలబడడంతో..‘భుజం దించు.. భుజం దించు…నేను మాట్లాడుతున్నాను కదా.’అని వార్నింగ్ ఇచ్చాడు.
అయితే పల్లవి ప్రశాంత్ తెలివిగా తన బాడీ లాంగ్వేజ్ ని చలి పుడుతుంది అని కవర్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు నువ్వు చూపిస్తున్న ఇదే బాడీ లాంగ్వేజ్ తో.. అన్నా…నేను బిగ్ బాస్ హౌస్ లోకి వస్తాను అని వీడియోస్ చేసినప్పుడు ఎందుకు చెప్పలేకపోయావు అని ఈ సందర్భంగా అమర్దీప్ నిలదీశాడు. రైతు కష్టం ఒక్కటే కాదు బీటెక్ చదివినోడి కష్టం నీకు తెలుసా రా?అని అమరదీప్ అడిగిన మాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది