Amardeep: బిగ్ బాస్ షో దాదాపు చివరి దశకు చేరింది. మొత్తంగా 19 మంది కంటెస్ట్ చేయగా టాప్ 7 మిగిలారు. వీరిలో ఇద్దరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. మిగతా ఐదుగురు టాప్ 5కి వెళతారు. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. అర్జున్ ఫినాలే అస్త్ర గెలిచిన నేపథ్యంలో అతడు నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు. శోభ, ప్రియాంక, శివాజీ, అమర్, ప్రశాంత్, యావర్ నామినేషన్స్ లో ఉన్నారు. సోమవారం నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. చివరి రెండు వారాలకు గాను ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి.
అత్యధిక ఓట్లు వచ్చిన వాళ్ళు టైటిల్ అందుకుంటారు. తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ వీక్ ఫైనల్ రేసు నుండి తప్పుకుంటారని బిగ్ బాస్ చెప్పాడు. కాబట్టి సోమవారం నుండి ఆడియన్స్ తమ ఫేవరెట్ కంటెస్టెంట్ గెలవాలని ఓట్లు వేస్తున్నారు. ఇక మంగళవారం ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హౌస్లో ఒకరికి నేరుగా ఆడియన్స్ ని ఓటు వేయమని రిక్వెస్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఈ అవకాశం టాస్క్ లలో గెలిచి సాధించాలి.
ఒక టాస్క్ లో యావర్, మరొక టాస్క్ లో శోభ గెలిచారు. వీరిద్దరిలో ఎవరికి ఛాన్స్ అనేది హౌస్ మేట్ నిర్ణయించాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఊహించినట్లే సీరియల్ బ్యాచ్ ప్రియాంక, అమర్… శోభకి ఓటు వేశారు. అర్జున్ కూడా వాళ్లకు తోడు కావడంతో శోభ విజయం సాధించింది. యావర్ కి శివాజీ, ప్రశాంత్ మాత్రమే ఓటు వేశారు. ఓటు వేయమని ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసే ఛాన్స్ శోభకు దక్కింది.
ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. టైటిల్ తో పాటు లభించే ప్రైజ్ మని నాకు చాలా అవసరం. ఓటు వేసి నన్ను గెలిపించండని ఆమె వేడుకుంది. అనంతరం సీరియల్ బ్యాచ్ మధ్య గొడవలు జరిగాయి. సరదాగా ఆడుకుంటున్న తరుణంలో అమర్ ముఖం మీద ప్రియాంక బొమ్మ విసిరింది. ముక్కుకు దెబ్బ తగిలిందని అమర్ కోపంగా లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో అమర్ తో ప్రియాంక, శోభ గొడవ పడ్డారు. ఇలాంటి ఆసక్తికర సంఘటనలతో ఎపిసోడ్ ముగిసింది…