Amar Deep Satires On Sohail: బిగ్ బాస్ రియాలిటీ షో లోకి అడుగుపెట్టి, టాప్ 5 లోకి వచ్చిన వాళ్ళు, అదే విధంగా టైటిల్ విన్నర్ గా నిల్చిన వాళ్ళు, రన్నర్ గా నిల్చిన వారు తమకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూసి తమని తాము గొప్పగా ఊహించుకుంటారు, ఈ ఫేమ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, హీరో గా , లేదా హీరోయిన్ గా భారీ సక్సెస్ లు కొట్టేయొచ్చని అనుకుంటారు. అలా వచ్చిన ప్రతీ ఒక్కరు బొక్క బోర్లా పడ్డారు. వాస్తవాన్ని గ్రహించి, ఎందులో అయితే భవిష్యత్తు ఉంటుందో, అందులో కెరీర్ ని కొనసాగిస్తున్న వాళ్ళు మాత్రం మానస్ లాగా ఫుల్ బిజీ గా గడుపుతున్నారు. సోహైల్ లాంటోళ్ళు కచ్చితంగా సినిమాల్లో సక్సెస్ అవుతాము అనే నమ్మకం తో కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తం ఖర్చు చేసి సినిమాలు తీసి చేతులు కాల్చుకొని మీడియా ముందు బోరుమని ఏడ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
‘బిగ్ బాస్ సమయం లో సోహైల్ సోహైల్ అంటూ వేల కామెంట్స్ పెట్టారు కదా అన్నా, దయచేసి వచ్చి నా సినిమాని చూడండి అన్నా, ఎటు పోయారు ఈరోజు మీరంతా’ అని సోహైల్ తన ‘బూట్ కట్ బాలరాజు’ సినిమా విడుదల సమయం లో మీడియా ముందుకొచ్చి ఏడ్చిన సందర్భాన్ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ వీడియో ని చూసి బాధపడిన వాళ్ళు ఉన్నారు, అదే విధంగా ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఈ వీడియో ని మీమ్స్ గా ఉపయోగిస్తుంటారు. అయితే బిగ్ బాస్ ఫేమ్ కేవలం బయటకు వచ్చిన తర్వాత కేవలం రెండు మూడు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత టైటిల్ విన్నర్ పేరు ని కూడా మర్చిపోతారు ఆడియన్స్. కేవలం ఆ షోలో పెరఫార్మన్ ని మాత్రమే చూసి వేసే ఓట్లు అవి.
ఇదే విషయాన్నీ బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అమర్ దీప్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘బిగ్ బాస్ లో ఓట్లు వేసిన ప్రతీ ఒక్కరు నా సినిమాకు వచ్చి చూస్తారంటే నేను నవ్వుతాను. అది అసలు జరగని పని. కేవలం మన టాలెంట్ , సినిమా కంటెంట్ ని చూసి మాత్రమే థియేటర్స్ కి కదులుతారు. నేను నా టాలెంట్ ని నమ్ముకొనే సినిమాలు చేస్తున్నాను. బిగ్ బాస్ ఫేమ్ ని చూసి కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది ఆయన ఉద్దేశపూర్వకంగా సోహైల్ ని అన్నట్టు మనకి అనిపించొచ్చు కానీ, ఆయన మాట్లాడిన తీరు చూస్తే మాత్రం ఆ భావన ఎవరికీ కదలదు. అమర్ దీప్ హీరో గా నటించిన ‘సుమతి శతకం’ అనే చిత్రం వచ్చే నెల 6 న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా అయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్నీ చెప్పుకొచ్చాడు.
