Allu Sneha: టాలీవుడ్ క్యూట్ కపుల్ జోడి లో అల్లు అర్జున్ కపుల్ కూడా ఒకటి.అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన ప్రతీ విషయాన్ని తనదైన స్టైల్లో పోస్ట్ లు పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. అల్లు అర్జున్ అర్హ క్యూట్ వీడియోస్ ఫెస్టివల్ ఫంక్షన్స్ వీడియోస్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటారు స్నేహ.

Also Read: పుష్ప సక్సెస్ మీట్ రద్దు.. కారణం ఏంటో తెలుసా?
సినిమా తారలకు ఏమాత్రం తీసిపోని క్రేజ్ తో ఇంస్టాగ్రామ్ లో 6.5 మిలియన్స్ ఫాలోవర్స్ దూసుకుపోతున్నారు ఈ అమ్మడు.తాజాగా స్నేహ రెడ్డి బ్లాక్ శారీలో దిగిన ఒక ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేశారు. దీనికి ‘వేరింగ్ ఆల్ బ్లాక్’ అనే కేప్షన్ కూడా యాడ్ చేశారు. తాజాగా మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన ఆ శారీ కి జుకాల్కర్ స్టైలింగ్ తో ఇంకాస్త అందాన్ని పెంచారు. ఆ శారీలో మేని బంగారంలా మెరిసి పోతున్నారు స్నేహ.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో ఓ రేంజ్ లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ ఫోటోకి గోల్డెన్ లేడీ సమంత కూడా తన స్టైల్ లో కామెంట్ ను యాడ్ చేసింది. “హాట్” అని కామెంట్ చేసి.. దాని పక్కన ఫైర్ ఎమోజీని పెట్టింది. దీంతో ఈ పిక్ మరింతగా వైరల్ అవుతోంది.
Also Read: యాంకర్ రష్మీ కెరీర్ నాశనం చేసిన యంగ్ హీరో